Hindi Serial Trolling: సినిమాల కంటే ఇప్పుడు సీరియళ్లు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. చాలా మంది ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారు టీవీ సీరియళ్లలో నటించాలని ఆసక్తి చూపుతున్నారు. వీటిని తీసే డైరెక్టర్లు సైతం సినిమా రేంజ్ లో చిత్రీకరిస్తున్నారు. కేవలం డ్రామా యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ, ఫైట్స్.. ఇలా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. లేటేస్టుగా ఓ సీరియల్ డైరెక్టర్ వచ్చిన ఐడియా చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. తన సీరియల్ లో పెట్టిన ఓ సీన్ చూసి ‘ఎక్కడి నుంచి వచ్చాయిరా ఈ ఐడియాలు..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సీన్ లో ఏముంది? ఆ డైరెక్టర్ ను అలా ఎందుకు అనాల్సి వచ్చింది?
టీవీల్లో వచ్చే కొన్ని హిందీ సీరియళ్లు బాగా ఫేమస్ అవుతాయి. వీటిని ఇతర భాషా వాళ్లూ సైతం ఫాలో అవుతారు. ఓ హిందీ సీరియల్ లోని సన్నివేశానికి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డైరెక్టర్ పెట్టిన ఓవరాక్షన్ సీన్ పై తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఈ సన్నివేశంలో భాగంగా.. హీరో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో నడుచుకుంటూ ముందుకు వెళ్లగా కాలు జారుతుంది. అలా జారిన వెంటనే తన చేతిలో ఉన్న మొబైల్ ఎగిరి పడి ల్యాండ్ ఫోన్ పై పడుతుంది. దీంతో ల్యాండ్ ఫోన్ పై ఉన్న రిసీవర్ ఎగిరి ఆ ఇంట్లో మెల్లగా తిరుగుతున్న ఫ్యాన్ రెక్కలపై పడుతుంది.
అయితే ఆ ఫోన్ రిసీవర్ ఫ్యాన్ రెక్కల నుంచి జారి పడి హీరో మెడకు చుడుతుంది. అలా ఫ్యాన్ తిరిగిన కొద్ది ఫోన్ వైర్ హీరో మెడకు చుడుతూ ఉరివేసినట్లుగా బిగుస్తుంది. దీంతో హీరో చావుబతుకుల వరకు వెళ్తాడు. అయితే ఆ గదికి లాక్ ఎవరు వేశారో తెలియదు. కానీ అవతల నుంచి కొందరు వ్యక్తుల తలుపు తీయగా ఎంతకూ రాదు. దీంతో తలుపు అద్దం బద్దలు కొట్టి లాక్ తీస్తారు. ఆ తరువాత హీరోను కాపాడే ప్రయత్నం చేస్తారు. కానీ అప్పటికే చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కానీ ఇక్కడి వరకు ఉన్న ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోను ‘స్పోసీ న్యూస్’ అనే ట్వి్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియో చూసిన చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. ఒక్క ఫోన్ వైర్ వల్ల మనిషి ప్రాణమే పోతుందా? అంటూ చమత్కారంగా కామెంట్ష్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సీన్ పెట్టిన డైరెక్టర్ ను మెచ్చుకోవాల్సిందే.. అని అంటున్నారు. ఏదీ ఏమైనా ఈ వీడియో తరహాలో కొన్ని సీరియళ్లలో కూడా ఇలాంటి సీన్స్ పెడుతూ రచ్చ చేస్తున్నారు.