https://oktelugu.com/

Gujarat: 200 లకు 212 మార్కులా? ఇదేలా సాధ్యమమ్మా టీచరమ్మ

పరీక్ష ఎంత బాగా రాసినా కూడా నూటికి నూరు మార్కులు రావడం కష్టమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విద్యార్థిని చాలా బాగా చదివి పరీక్షలు రాసింది కావచ్చు. ఫుల్ గా మార్కులు వచ్చేశాయి.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : May 7, 2024 / 04:42 PM IST

    Gujarat

    Follow us on

    Gujarat: ఎంత చదివినా సరే వందకు 95 రావడమే విశేషం. కొందరికి 98 వస్తే వామ్మో 98 వచ్చాయా అంటారు. ఇక 99 వస్తే వారిని ఆకాశంలో పెట్టి మరీ చూస్తారు. 100 కు 99 మార్కులు అంటే వామ్మో వారు గ్రేట్, అంటూ పొగిడేస్తుంటారు. కాస్త తక్కువ వస్తే మాత్రం ఏం చదువులు ఇదేనా స్కూల్ లో నేర్చించేది అంటూ తిడుతుంటారు. కానీ ఇక్కడ వచ్చిన కొన్ని మార్కులను చూస్తే ఏం అంటారో ఓ సారి చదవండి..

    పరీక్ష ఎంత బాగా రాసినా కూడా నూటికి నూరు మార్కులు రావడం కష్టమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విద్యార్థిని చాలా బాగా చదివి పరీక్షలు రాసింది కావచ్చు. ఫుల్ గా మార్కులు వచ్చేశాయి. అంతేకాదు టీచర్ వేసిన మార్కులు చూస్తే కూడా షాక్ అవ్వాల్సిందే. రెండు సబ్జెక్టులకు 200 మార్కుల చొప్పున పరీక్షలు రాస్తే అందులో ఏకంగా 212, 211 మార్కులు వచ్చాయి. దీంతో విద్యార్థి సదరు మార్కులు చూసిన తల్లిదండ్రులు ఈ వింతను నమ్మలేకపోయారు. వెంటనే ఈ విషయాన్ని విద్యాశాఖ అధికారులకు తెలిపారు.

    ఈ చిత్ర విచిత్ర ఘటన గుజరాత్ లోని దాహోద్ జిల్లాలో చోటు చేసుకుంది. గుజరాత్ లోని దాహోద్ జిల్లా ఝలోద్ తాలూకా ఖరసనా అనే ఊరిలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. అందులో నాల్గవ తరగతి చదువుతున్న వంశీబెన్ మనీష్ భాయ్ అనే విద్యార్థినీ రీసెంట్ గా పరీక్షలు రాసింది. ఈమె ఫలితాలు మాత్రం అనూహ్యంగా వచ్చాయి. రెండు సబ్జెక్టుల్లో 200 మార్కుల కంటే ఎక్కువ వచ్చాయి. గుజరాతీ లాంగ్వేజ్ లో 200 కు 211కు, గణితంలో 200 కు 212 మార్కులు వచ్చాయట.

    మొత్తంగా 1000 మార్కులకు 934 మార్కులు సాధించింది వంశీబెన్. ప్రస్తుతం ఈ మార్కుల షీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన కారణాలు తెలుసుకొని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపిందట విద్యాశాఖ.