Ramcharan – NTR Centenary Celebrations : ఎన్టీఆర్ లాంటి యుగపురుషుడు మళ్ళీ పుట్టడు..జై ఎన్టీఆర్ అంటూ రామ్ చరణ్ అద్భుతమైన స్పీచ్

ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని, ఇంత పెద్ద ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు బాలయ్య గారికి మరియు చంద్ర బాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిచేయచేస్తున్నాను. జై ఎన్టీఆర్' అంటూ రామ్ చరణ్ ఇచ్చిన స్పీచ్ కి నందమూరి ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయిపోయారు.

Written By: Vicky, Updated On : May 21, 2023 9:04 am
Follow us on

Ramcharan – NTR Centenary Celebrations : తెలుగు సినిమా ఇండస్ట్రీ కి చరిత్ర లాంటి వాడు, ఆయన పేరు చెప్తే తెలుగు ప్రజలందరూ గర్వం తో పులకరించిపోతారు, ఆయన ఈ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నో సేవలు అందించాడు. కోట్లాది మంది ప్రజల గుండె చప్పుడు అయ్యాడు, తెలుగు సినిమా ఖ్యాతిని , తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచం నలుమూలల విస్తరింపజేసిన మహానుభావుడు నందమూరి తారకరామారావు. ఆ కారణజన్ముడు పుట్టి వంద ఏళ్ళు పూర్తి అయ్యింది.

ఈ సందర్భంగా గత కొద్దిరోజుల క్రితమే విజయవాడ లోనే కైకలూరు లో ఒక గ్రాండ్ ఫంక్షన్ ని ఏర్పాటు చెయ్యగా, ఈ ఫంక్షన్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు.అలాగే హైదరాబాద్ లో కూడా ఈ ఈవెంట్ ని నిన్న రాత్రి ఘనంగా జరిపించారు. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ మరియు ప్రభాస్ ఇలా అందరినీ ఆహ్వానించారు.

కానీ రామ్ చరణ్ తప్ప ఒక్కరు కూడా ఈ ఈవెంట్ కి హాజరు కాలేకపోయారు. కారణం ఏంటో తెలియదు కానీ, నందమూరి ఫ్యాన్స్ దీనిపై చాలా సీరియస్ గా ఉన్నారు. మరో పక్క నిన్న ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్, అద్భుతమైన స్పీచ్ తో అదరగొట్టేసాడు. ఆయన మాట్లాడుతూ ‘ఆ మహానుభావుడి గురించి మాట్లాడే అర్హత కానీ, అనుభవం కానీ నాకు లేదు. కానీ ఆయన గురించే మాట్లాడే ఛాన్స్ వచ్చింది కాబట్టి అదృష్టం గా భావిస్తున్నాను.తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఆయువుపట్టులాంటివాడు ఎన్టీఆర్. మన ఇండస్ట్రీ కి కేవలం ఇప్పుడు మాత్రమే పాన్ వరల్డ్ రేంజ్ లో గుర్తింపు రాలేదు, ఆరోజుల్లోనే ఎన్టీఆర్ మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలల విస్తరింపచేసాడు. తెలుగువాడి ఆత్మగౌరవం ఎన్టీఆర్, ఆయనని నేను ఎక్కువ సార్లు కలవలేకపోయాను కానీ, నేను కలిసిన ఒకే  ఒక్క సందర్భం నా జీవితం లో ఎప్పటికీ మర్చిపోలేను.అది పురందేశ్వరి గారి అబ్బాయి కారణంగా నాకు ఆ అదృష్టం కలిగింది,మేమిద్దరం స్కెటింగ్ క్లాసులకు వెళ్ళేవాళ్ళం, ఒక రోజు పురందేశ్వరి గారి అబ్బాయి మా తాతయ్య దగ్గరకి పోదాం అని నన్ను తీసుకెళ్లాడు. అప్పుడే ఎన్టీఆర్ గారు కుర్రాడిలాగా వర్కౌట్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ చెయ్యడానికి సిద్ధం గా ఉన్నాడు. నేను రాగానే నన్ను ఆయనతో పాటు కూర్చోపెట్టుకొని చికెన్ తినిపించారు. ఇది నేను ఎప్పటికీ మర్చిపోలేని, ఇంత పెద్ద ఈవెంట్ కి నన్ను పిలిచినందుకు బాలయ్య గారికి మరియు చంద్ర బాబు నాయుడు గారికి ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిచేయచేస్తున్నాను. జై ఎన్టీఆర్’ అంటూ రామ్ చరణ్ ఇచ్చిన స్పీచ్ కి నందమూరి ఫ్యాన్స్ మొత్తం ఫిదా అయిపోయారు.