https://oktelugu.com/

Beer Powder Germany: ఇంట్లోనే బీర్ ను ఇలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.. ఎలాగో చూడండి..

ఇంట్లో చల్లటి నీళ్లను ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల బీర్ పౌడర్ ను పోసి షేక్ చేయాలి. 45 గ్రాముల బీర్ పౌడర్ తో ఒక బాటిల్ బీర్ తాగిన ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి నాన్ అల్కాహాలిక్ బీర్ ను మాత్రమే తయారు చేశారు. భవిష్యత్ లో అల్కహాలిక్ బీర్ కూడా వస్తుందని చెబుతున్నారు. బీర్ పౌడర్ మార్కెట్లో సక్సెస్ అయితే లిక్విడ్ బీర్ రవాణా తగ్గిపోయే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 19, 2023 / 12:10 PM IST

    Beer Powder Germany

    Follow us on

    Beer Powder Germany: నేటి కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఒత్తిడికి గురవుతున్నారు. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారస్తుల వరకు ప్రతి రోజూ తమ పనుల్లో నిమగ్నం కావడంతో శరీరంపై స్ట్రెయిన్ పడుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణిస్తోంది. అయితే రోజంతా ఎంత బిజీ ఉన్నా కనీసం రెండు గంటల పాటు రిలాక్స్ గా ఉంటేనే బాడీ ఉల్లాసంగా మారుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఈ తరుణంలో రిలాక్స్ కావడానికి చాలా మంది రకరకాల మార్గాలను ఎంచుకున్నారు. కొందరు సినిమాలు, టీవీలు చూస్తూ ఉల్లాసంగా గడుపుతారు. మరికొందరు ఫ్యామిలీతో కలిసి షికారుకెళ్లారు. ఇంకొందరు మాత్రం మద్యం సేవిస్తూ ఆనందంగా గడపుతున్నారు. మద్యంలో ఒకటి వైన్ కాగా.. మరొకటి బీర్లు లభ్యమవుతాయని తెలుసు. కూల్ కూల్ గా ఉండే బీర్ అంటే చాలా మంది లైక్ చేస్తారు. వీటిని ఇక నుంచి మద్యం షాపుల్లో కొనకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చని అంటున్నారు. అదెలాగో చూద్దాం..

    వేసవి కాలంలో చల్లటి బీర్ తాగితే అప్పటి వరకు ఉన్న ఒత్తిడి అంతా మాయం అవుతుందని మద్యం ప్రియులు పేర్కొంటారు. వైన్ కంటే తక్కువ రేటుతో పాటు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని భావించి చాలా మంది బీర్లు తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే చల్లగా ఉన్నప్పుడే బీర్ టేస్టీగా ఉంటుంది. కూల్ నెస్ పోయిగా చేదుగా మారుతుంది. దీంతో అన్ని సమయాల్లో బీర్ పనిచేయదు. అలాగే బీర్లను తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలంటే ఫ్రిజ్ ఉండాలి. ఈ సౌకర్యం లేనివాళ్లు ఇబ్బందులకు గురవుతారు. ఇలాంటి తరుణంలో జర్మనీకి చెందిన ఓ కంపెనీ ఓ ప్రయోగాన్ని చేపట్టి సక్సెస్ అయింది.

    ఇక నుంచి బీర్లు లిక్విడ్ గా కాకుండా పౌడర్లలో కొనుగోలు చేయొచ్చని తెలిపింది. జర్మనీకి చెందిన బ్రూవరీ న్యూజెల్లర్ క్లోస్టర్బూ అనే సంస్థ ప్రపంచంలోనే తొలి ఇన్ స్టంట్ బీర్ పౌడర్ ను తయారు చేసింది. ఈ పౌడర్ ప్యాకేట్ జేబులో పెట్టుకొని ఎక్కడంటే అక్కడా బీరు తయారు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు టీ, కాఫీ పౌడర్లు రావడంతో ఇన్ స్టంట్ గా తయారు చేసుకున్నారు. ఇప్పుడు బీర్ పౌడర్ ను కూడా అలాగే తయారు చేసుకోవచ్చని ఆ సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. మరి ఈ బీరును ఎలా తయారు చేయచ్చంటే..?

    ఇంట్లో చల్లటి నీళ్లను ఒక గ్లాసులో తీసుకోవాలి. ఇందులో రెండు స్పూన్ల బీర్ పౌడర్ ను పోసి షేక్ చేయాలి. 45 గ్రాముల బీర్ పౌడర్ తో ఒక బాటిల్ బీర్ తాగిన ఫీలింగ్ వస్తుందని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి నాన్ అల్కాహాలిక్ బీర్ ను మాత్రమే తయారు చేశారు. భవిష్యత్ లో అల్కహాలిక్ బీర్ కూడా వస్తుందని చెబుతున్నారు. బీర్ పౌడర్ మార్కెట్లో సక్సెస్ అయితే లిక్విడ్ బీర్ రవాణా తగ్గిపోయే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

    గతంలో కింగ్ ఫిషర్ కంపెనీ ఇలాగే బీర్ పౌడర్ ప్యాకెట్లు మార్కెట్లో పరిచయం చేసింది. కానీ అవి సక్సెస్ కాలేదు. కొందరు మద్యం ప్రియులు ఇంట్లో తాగడం కంటే మద్యం దుకాణాలు, బార్ షాపుల్లోకి వెళ్లి తాగాలంటేనే ఇష్టపడుతారు. ఈ నేపథ్యంలో ఇండియాలో ఈ ఇన్ స్టంట్ బీర్ ప్యాకెట్ సక్సెస్ అవుతుందా? లేదా? అనేది అనుమానమేనని కొందరు అంటున్నారు. అయితే ఇంటలో మద్యం సేవించే వారికి మాత్రం ఇది ఉపయోగకరమేనన్న వాదన వినిపిస్తోంది.