https://oktelugu.com/

Rebirth Secrets: గత జన్మ తల్లిదండ్రులను అడిగిన చిన్నారి.. ఆశ్చర్యం

Rebirth Secrets: మనిషికి మరో జన్మ ఉంటుందా? దీనిపై అందరికి అనుమానాలు ఉన్నాయి. కానీ గత జన్మ అనుభవాలతో ఓ సినిమా తీసి అందులో నాలుగు వందల సంవత్సరాల తాలూకు గుర్తులతో అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. కానీ అది సినిమా. నిజ జీవితంలో గత జన్మలో జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే మామూలు విషయం కాదు. పునర్జన్మలపై కొందరికి నమ్మకం ఉన్నా మరికొందరైతే అసలు నమ్మరు. మరో జన్మ ఉన్నదనేది శుద్ధ అబద్ధమని వాదించే […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 26, 2022 / 10:45 AM IST
    Follow us on

    Rebirth Secrets: మనిషికి మరో జన్మ ఉంటుందా? దీనిపై అందరికి అనుమానాలు ఉన్నాయి. కానీ గత జన్మ అనుభవాలతో ఓ సినిమా తీసి అందులో నాలుగు వందల సంవత్సరాల తాలూకు గుర్తులతో అందరిని మెప్పించిన విషయం తెలిసిందే. కానీ అది సినిమా. నిజ జీవితంలో గత జన్మలో జరిగిన విషయాలు గుర్తుకు రావడం అంటే మామూలు విషయం కాదు. పునర్జన్మలపై కొందరికి నమ్మకం ఉన్నా మరికొందరైతే అసలు నమ్మరు. మరో జన్మ ఉన్నదనేది శుద్ధ అబద్ధమని వాదించే వార లేకపోలేదు. ఈ నేపథ్యంలో గత జన్మ తాలూకు గుర్తులు చెబుతూ ఓ బాలిక రాజస్తాన్ లో సంచలనం సృష్టిస్తోంది.

    Rebirth Secrets

    వివరాల్లోకి వెళితే రాజస్తాన్ లోని పారావాల్ గ్రామానికి చెందిన రతన్ సింగ్ చుందావత్ కు ఐదుగురు కుమార్తెలు. వారిలో నాలుగో కుమార్తె ఏడాది క్రితం విచిత్రంగా ప్రవర్తించింది. తన సోదరుడు ఎక్కడ అని ప్రశ్నించడం మొదలుపెట్టింది. దానికి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో ఆమెకు ఏమయిందని ఆస్పత్రిలో చూపించారు. వైద్యులు ఆమెకు ఏ వ్యాధి లేదని తేల్చారు. దీంతో ఆమె చెప్పిన విషయాల గురించి ఆరా తీయగా అన్ని కరెక్టుగానే చెబుతోంది.

    దీంతో ఆమె చెప్పిన ప్రకారం ఆరా తీయగా గత జన్మలో తన పేరు ఉష అని తేలింది. 2013లో ప్రమాదవశాత్తు మంటల్లో కాలిపోయినట్లు చెప్పింది. ఆమె చెప్పిన దాంతో పోల్చితే పిప్లాంతి గ్రామంలో ఉన్నవారిని గురించి వివరించింది. వారితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. దీంతో రెండు కుటుంబాల మధ్య సంబంధం ఏర్పడింది. అయితే గత జన్మలో తాను ఇక్కడే జన్మించానని చెబుతున్న మాటలతో వారికి సాన్నిహిత్యం మాత్రం ఏర్పడింది.

    Also Read: బక్కగా ఉన్నారా.. బలంగా మారాలంటే తినాల్సిన ఆహార పదార్థాలివే?

    అయితే ప్రస్తుతం మాత్రం జన్మనిచ్చిన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నా తన గత జన్మ తాలూకు అనుబంధాలతో ఆమె గతంలో వచ్చిన ఓ హిందీ సినిమా కరణ్ అర్జున్ కథను పోలి ఉండటం గమనార్హం. ఏది ఏమైనా ఆ బాలిక చెప్పిన విషయాలు సరిపోవడంతో రెండు కుటుంబాల మధ్య మాత్రం బంధం ఏర్పడటం కొసమెరుపు. ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా గత జన్మ తాలూకు అనుభవాలు గుర్తుకు వస్తాయని కొందరి వాదన.

    ఏదిఏమైనా అచ్చంగా సినిమా కథనంలా అనిపించే బాలిక చెప్పిన విషయాలపై అందరిలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అన్ని విషయాలు ఇంత కరెక్టుగా సమాధానం చెప్పడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. నిజంగానే ఆమెకు గత జన్మ తాలూకు అనుభవాలు గుర్తుకు వచ్చాయా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో బాలికకు మరో జన్మ ఎలా వచ్చిందని ప్రశ్నలు వస్తున్నాయి.

    Also Read: చనిపోయిన వారు తరచూ కలలో కనిపిస్తున్నారా.. అయితే దాని సంకేతం ఇదే!

    Tags