
Female Family Councilor: ఇలా అంటే ఏ మహిళకైనా ఎక్కడ లేని కోపం పుట్టుకొస్తుంది.. ఈ మాట అన్నవారిని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు.. ఇదే కామెంట్ ఓ పురుషుడు చేస్తే అగ్గి రగిలేది.. కానీ ఓ మహిళా ఫ్యామిలీ కౌన్సిలర్ చేసిన వ్యాఖ్యలివి. ఓ మహిళ మరో మహిళను ఇంత దారుణమైన మాటలు అనడం వెనుక పెద్ద అర్థమే ఉందని ఆమె చెబుతున్నారు. ఇళ్లల్లో ఉన్న కొంత మంది లేడీస్ కు ఏ పని పాట లేకుండా ఉండడంతో అనవసరమైన గొడవలు పెట్టుకుంటూ.. భర్తను హింసిస్తున్నారని, ఆ తరువాత తమ సంసారాన్నే నాశనం చేసుకుంటున్నారని ఆమె చెబుతున్నారు. తమ దగ్గరికి కౌన్సిలింగ్ కోసం వచ్చే వారి కారణాల చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో అర్థం కావడం లేదని ఆమె పేర్కొంటోంది.
ఒక కుటుంబంలో ఉద్యోగం లేదా వ్యాపారం చేసి డబ్బు సంపాదించే బాధ్యత భర్తది. ఎన్నో కష్టాలు, మనోవేదనతో పొద్దంతా పనిచేసిన భర్త ఇంట్లోకి రాగానే కొంత మంది ఆడాళ్లు వారిని సరిగా రిసీవ్ చేసుకోరు. వారి స్వార్థం వారు చూసుకుంటారు. పైగా తనకు అది కొనివ్వలేదు.. ఇది కొనివ్వలేదంటూ గొడవ చేస్తారు. ఆఫీసుల్లో పనిచేసేవారు ఏదో ఒక సందర్భంలో తోటి ఉద్యోగిణులతో చనువుగా ఉండాల్సి వస్తుంది.దీనిని ఆసరాగా చేసుకొని భార్యలు చేసే టార్చర్ తో భర్తలు పలు వ్యసనాల బారిన పడుతున్నారు.. అని ఆమె అంటున్నారు.

అయితే వీళ్లు ఇలా తయారు కావడానికి భర్తలే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఇంట్లో తమ భార్యలకు పని చెప్పకుండా పనిమనుషులను కేటాయించడం ద్వారా వారికి ఎలాంటి పని ఉండడం లేదు. ఉదయం లేచిందగ్గర్నుంచి పడుకునేవరకు టీవీలు చూస్తూ, ఇతరులతో ముచ్చట్లతో కాలక్షేపం చేసేవారే ఎక్కువగా ఉన్నారు. అయితే చాలా మంది భర్తలు తమ భార్యలను గాబరం చేస్తూ వారికి పని చెప్పరు. అలా చెప్పకపోయేసరికి వారు మొద్దులా తయారవుతారని ఫ్యామిలీ కౌన్సిలర్ చెబుతున్నారు.
ఇక మొగాళ్లు కష్టపడి ఇంటికొచ్చాక కాస్త ప్రేమతో తమ భార్యతో ఉండాలని చూస్తారు. కానీ తనను పట్టించుకోవడం లేదంటూ.. చిన్న చిన్న కారణాలతో భర్తలను దూరంగా పెడుతారు. ఇలా రోజుల తరబడి భర్తలను దూరంగా ఉంచడం ద్వారా ఆ భర్తకు కోపం వస్తే అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది.. భర్తకు వచ్చిన కోపంతో భార్యకున్న అనుమానంతో ఇద్దరి మధ్య గొడవలు పెట్రేగిపోతాయి. ఆ తరువాత విడాకులంటూ తమ లాంటి వారి వద్దకు వస్తారు. అయితే మొత్తంగా ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఏదో ఒక పని వ్యాపకం పెట్టుకోవడంతో పాటు కాస్త శారీరక శ్రమ ఉండే పనులు చూసుకోవాలి. అలాగే ఇంటి బాధ్యతలను భార్యలకు అప్పగించాలని ఆమె తెలుపుతున్నారు.. మరిన్ని ఆసక్తికర విషయాలు చెప్పిన ఈ వీడియో చూడండి..