
Gowri Munjal: సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు..కానీ గుర్తింపు కొందరికే వస్తుంది. కొందరికి పదుల కొద్ది సినిమాల్లో నటించిన ఫేమస్ కాలేరు. కానీ కొందరు మాత్రం ఫస్ట్ మూవీతో ఆట్రాక్ట్ చేస్తారు. అయితే మొదటి సినిమాతో పాపులర్ అయిన హీరోయిన్లు ఆ తరువాత సినిమాల్లో కనిపించకుండా పోయారు. అలాంటి వారిలో గౌరిముంజల్ ఒకరు. గౌరీ ముంజల్ డెబ్యూ సినిమాతోనే స్టార్ గుర్తింపు వచ్చింది. అల్లు అర్జున్ నటించిన ‘బన్నీ’ సినిమాతో ఈమె పేరు మారుమోగింది. అయితే చాలా ఏళ్లకొద్దీ ఆమె తెరపై కనిపించడం లేదు.మరి ఇప్పుడు ఆమె ఏం చేస్తున్నారు? ఎక్కడున్నారు?
గౌరి ముంజల్ 1985 జూన్ 6న ఢిల్లీలో జన్మించారు. స్టడీస్ కంప్లీట్ చేసిన తరువాత ఆమె సినిమాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదే సమయంలో అల్లు అర్జున్ నటించే ‘బన్నీ’ సినిమా కోసం హీరోయిన్ పాత్ర కోసం ఎంపికలు జరుగుతున్నాయని తెలుసుకున్న ఆమె నిర్మాతలను కలుసుకుంది. ఈమెను పరీక్షించిన నిర్మాతలు ఈ సినిమాకు ఓకే చేశారు. ‘బన్నీ’ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినా గౌరీ ముంజల్ కు మాత్రం గుర్తింపు వచ్చింది. దీంతో ఆమెకు సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి.

‘బన్నీ’ తరువాత కన్నడ మూవీ ‘నమ్మ బసవ’ అనే సినిమాలో నటించింది. ఆ తరువాత మళ్లీ తెలుగు నుంచి ఆఫర్లు వచ్చాయి. శ్రీకాంత్ తో కలిసి ‘శ్రీకృష్ణ 2006’, ‘గోడ మీద పిల్లి’ లాంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాల ద్వారా అందం, అభినయంతో ఆకట్టుకున్నా.. అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఈ భామ మెల్ల మెల్లగా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. కొన్ని సంవత్సరాల పాటు మళ్లి తెరను చూడలేదు.
ఇటీవల గౌరీముంజల్ కు సంబంధించిన లేటేస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 40 ఏళ్లు వచ్చినా ఈ భామ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆమె అప్పటికీ ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తున్నారు. గౌరీ ముంజల్ లేటేస్ట్ పిక్స్ చూసి చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. కొందరు మళ్లీ సినిమాల్లో ట్రై చేస్తున్నారా? అని అడుగుతున్నారు. గౌరీ ముంజల్ మాత్రం ఆ కామెంట్లను పట్టించుకోవడం లేదు.