
Cyber Fraud: సోషల్ మీడియా వృద్ధి చెందిన తర్వాత లాభాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. కొంతమంది సైబర్ నేరగాళ్లు డబ్బుని ఎరగా వేసి ఎంతో మంది అమాయకులను మోసం చేస్తూ పక్కా ప్లానింగ్ తో డబ్బులు దోచుకుంటున్నారు. రీసెంట్ గా ఒక జంట సినిమా రివ్యూల పేరిట దాదాపుగా కోటి రూపాయలకు పైగా మోసపోయారు.
వివరాల్లోకి వెళ్తే ఒక జంటకి టెలిగ్రామ్ లో ఒక గుర్తు తెలియని వ్యక్తి దగ్గర నుండి ఒక ప్రకటన వచ్చింది.తమ వెబ్ సైట్ లో ఉన్న సినిమాలను చూసి రివ్యూ చెప్పిన చెప్తే ఒక్కో సినిమాకి 2500 నుండి 5000 రూపాయిల వరకు డబ్బులిస్తామని చెప్పుకొచ్చారు. అతను ఇచ్చిన ఈ ప్రకటనని ఆ జంట నమ్మింది. ఆ తర్వాత టెలిగ్రామ్ లో ఈ జంటని పెట్టి ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఒక వెబ్ సైట్ లింక్ పంపాడు.
అందులో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి..టికెట్స్ కొనుగోలు చేసి సినిమా రివ్యూ చెప్తూ వచ్చారు, ఆ జంటని నమ్మించేందుకు ఒక ఆరు నెలల పాటు ఇచ్చిన మాట ప్రకారమే రివ్యూస్ చెప్తున్నందుకు డబ్బులు ఇస్తూ వచ్చారు. ఒకానొక దశలో 40 లక్షల రూపాయిలు విలువ గల టికెట్స్ ని కొనుగోలు చేయించాడు ఆ సైబర్ నేరగాడు. ఆ తర్వాత అతను వీళ్ళ అకౌంట్ లోకి 70 లక్షల రూపాయిలు జమ చేసాడు.ఈ డబ్బులను ఖర్చు చెయ్యకండి, మీ అకౌంట్ లోనే ఉంచుకోండి, నేను వేరే బిజినెస్ చెప్తాను, కోటి 20 లక్షల రూపాయిలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది అని అన్నాడు.

ఇన్ని రోజలు నమ్మకం తో ఉన్నాడు కాబట్టి అతనిని ఈ జంట గుడ్డిగా నమ్మి కోటి 20 లక్షల రూపాయిలు పంపింది.అంతే ఇక డబ్బులు మళ్ళీ తిరిగిరాలేదు. సైబర్ నేరగాడి నుండి ఎలాంటి రెస్పాన్స్ కూడా రాలేదు.దీనితో మోసపోయాము అని గ్రహించిన ఈ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరో గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ జంట గొప్ప విద్యావంతులు అట, చదువుకున్నోళ్ళు కూడా ఇలా ముందు వెనుక ఆలోచించకుండా ఎలా అంత డబ్బు పెట్టేశారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.