Viral video: ‘పొట్టోన్ని పొడుగోడు కొడితే.. పొడుగోన్ని పోచమ్మ కొట్టిందట..’ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ఈ డైలాగ్ పాపురలర్ అయింది. ఈ సామెత ఎప్పటి నుంచో వాడకంలో ఉంది. ఒకరిని చంపాలని చూస్తే.. అతడిని చంపాలని మరొకరు చూస్తారు.. అనే విషయాలు చెప్పేటప్పుడు దీనిని వాడేవారు. అయితే ఇవి ఊరికే పుట్టలేదు. భూమ్మీద అలాంటి సంఘటనలు జరిగాకే సామెతగా కొందరు తీసుకొచ్చారు. ఇప్పటి వరకు అయితే తెలియదు గానీ.. తాజాగా ఇలాంటిదే ఓ సంఘటన జరిగింది. ఒక పక్షిపై వేటకు వెళ్లిన ఓ జంతువు దురదృష్టవశాత్తూ తనే వేటకు బలైంది.. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంతకీ అసలు విషయమేంటంటే..
పచ్చని చెట్ల మధ్య ఓ కొలను ఉంటుంది. అక్కడ ఏదైనా చిన్న చేప లేదా కీటకం దొరుకుతుందా..? అని ఓ కొంగ ఎదురుచూస్తూ ఉంటుంది. ఇంతలో కొలను నుంచి ఓ మొసలి మెల్లగా కొంగను తినేయాలని బయటకు వస్తుంది. ఏర్పడకుండా ఉండాలని మధ్యలో నక్క నక్కి ఉంటుంది. దగ్గరికి వచ్చ ఒక క్షణమైతే కొంగనే నోట్లే వేసుకోవడానికి రెడీ అవుతుంది. కానీ ఇంతలో చెట్ల పొదల్లో అప్పటికే వేచి చూస్తున్న మరో మొసలి సడెన్లీగా అక్కడి వచ్చి కొంగను తినేయాలనుకున్న మొసలిని నోట్లో వేసుకుంటుంది. ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా ఆ మొసలిని ఇంకో మొసలి మిగేసి మెల్లగా కొలనులోకి జారకుంటుంది.
అమాయకంగా అటూ ఇటూ చూస్తున్న పిల్ల మొసలి రాగానే తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంతలో పెద్ద మొదలి దానిని కరుచుకొని వెళ్లడంతో కొంగ తీక్షణంగా చూస్తుంది. తనపై వేటకు వచ్చిన మొసలి.. తానే బలికావడంపై కొంగ మనసులో అనుకుంటూ చూసినట్లు కొందరు పేర్కొంటున్నారు. గత మే 12న పోస్టు చేసిన ఈ వీడియోను వైరల్ అవుతోంది. ఈ వీడియోపై చాలా మంది భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఓ నెటిజన్ ‘కొంగ పెద్ద మొసలి స్నేహితులు.. అందుకే కొంగను ఆ మొసలి కాపాడింది’ అని పెట్టాడు. మరో నెటిజన్ ‘కొంగ ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది’ అని అనగా ఇంకొకరు ‘ఆ కొంగ చాలా సేపు అలా చూస్తు ఉండిపోయింది..’ అని కామెంట్ చేశారు. ఏదీ ఏమైనా ఒక్కోసారి దురదృష్టం నెత్తిన ఉంటే చేయాలనుకున్న పనులు రివర్స్ అవుతాయని పలువురు చర్చించుకుంటున్నారు.
View this post on Instagram