Maharashtra: సంఘవిద్రోహ శక్తుల నుంచి తమను తాము కాపాడుకునేందుకు ప్రజలకు భద్రతా దళాలు అవగాహన కల్పిస్తుంటాయి. టెర్రరిస్టులు ఎదురుపడినప్పుడు..ప్రమాదాలు జరిగినప్పుడు.. తమను తాము ఎలా రక్షించుకోవాలో చేసి చూపిస్తుంటారు. అయితే ఇవి ఒక్కోసారి వికటిస్తుంటాయి. అవగాహన కల్పించే వారిపై అనుమానపు చూపులు ఎదురవుతాయి. మహారాష్ట్రలో ఇటువంటి ఘటనే ఒకటి వెలుగు చూసింది.
సడన్ గా తీవ్రవాదులు ఎంటర్ అయితే.. ఏ విధంగా ప్రతిఘటించాలో అవగాహన కల్పించేందుకు పోలీసులు డిసైడ్ అయ్యారు. మహారాష్ట్రలోని ధూలే జిల్లాలో ఓ దాబా వద్ద పోలీసుల టెర్రరిస్టులుగా ప్రత్యక్షమయ్యారు. ఆయుధాలతో హల్చల్ చేశారు. అక్కడున్న వారిని బెదిరించారు. దీంతో అక్కడున్న ఓ చిన్నారి భయపడింది. తీవ్రంగా రోదించింది. దీంతో కట్టలు దిగిన ఆగ్రహంతో చిన్నారి తండ్రి వారిపై తిరగబడ్డాడు. పోలీసులని తెలియక చేయి చేసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో అక్కడికి పోలీస్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. వారు టెర్రరిస్టులు కాదని.. పోలీసులేనని చెప్పినా ఆయన వినలేదు. చివరకు తమ గుర్తింపు కార్డులు చూపించడంతో వెనక్కి తగ్గాడు.
అయితే టెర్రరిస్టులని తెలిసిన ఆయన ప్రతిఘటించిన తీరు అభినందనలు అందుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేటిజెన్లకు తెగ ఆకట్టుకుంటోంది. ధైర్య సాహసాలను ప్రదర్శించిన సదరు వ్యక్తికి నేటిజన్లు అభినందిస్తున్నారు.
మాక్ డ్రిల్ నిర్వహిస్తున్న పోలీసుల మీద దాడి చేసిన సామాన్యుడు
మహారాష్ట్ర – టెర్రరిస్టులు అటాక్ చేసినపుడు ఎలా వ్యవరించాలని ధులే జిల్లాలో ఓ ధాబా వద్ద పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహిస్తుండగా, టెర్రరిస్టు దుస్తుల్లో ఉన్న వారిని చూసి తన కూతురు భయపడటంతో ఓ వ్యక్తి వారి మీద దాడి చేశాడు. pic.twitter.com/3Upfca0hJc
— Telugu Scribe (@TeluguScribe) August 9, 2023