Japan: పిల్లికి భయపడుతున్న మహానగరం.. ఇంతకీ ఏమైందంటే..

పుకుయామాలో ఓ పిల్లి చాలా ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో పడిందట. అందులో పడిన దగ్గర నుంచి పిల్లి కనిపించడం లేదట. ఒక వేళ ఆ పిల్లి బయట తిరిగితే.. క్యాన్సర్ కారక రసాయనాన్ని వెదజల్లుతుంటుంది.

Written By: Swathi, Updated On : March 18, 2024 12:11 pm

Japan

Follow us on

Japan: జపాన్ లో ఏ వార్త వినాల్సి వస్తుందో అని జనాలు భయంతో వణుకుతున్నారు. ఈ దేశంలోని పుకుయామా ఓ రేంజ్ లో వణికిపోతుందట. దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారా? కేవలం పిల్లి. ఒక మహానగరాన్ని ఓ పిల్లి వణికిస్తుందట. ఇప్పుడు అధికారులు ఆ పిల్లి జాడ కనిపెట్టి.. పట్టుకునేందుకు తెగ సర్చ్ చేస్తున్నారు. ఈ పిల్లిని ఎంత త్వరగా పట్టుకుంటే.. ఆ మహానగరానికి అంత ఉపశమనం అన్నమాట. మరి ఆ పిల్లి కథ ఏంటి అనుకుంటున్నారా?

పుకుయామాలో ఓ పిల్లి చాలా ప్రమాదకరమైన రసాయనాల ట్యాంకులో పడిందట. అందులో పడిన దగ్గర నుంచి పిల్లి కనిపించడం లేదట. ఒక వేళ ఆ పిల్లి బయట తిరిగితే.. క్యాన్సర్ కారక రసాయనాన్ని వెదజల్లుతుంటుంది. దీని వల్ల నగరవాసులకు చాలా డేంజర్ కాబట్టి.. ప్రజలు, అధికారులు భయపడుతున్నారు. ఇక ఈ పిల్లిని వెతికేందుకు ఏకంగా ప్రత్యేక బృందాలే బయలుదేరారట. ఆ పిల్లి కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు.

ఒక రసాయన కర్మాగారం నుంచి ఆ పిల్లి వెళ్లిపోయినట్టు సీసీ టీవీ ఫుటేజ్ లో చివరిసారిగా కనిపించిందట. ఓ కార్మికుడు పిల్లి జాడను చూసి.. అధికారులకు తెలియజేశారట. ఇక ఆ పిల్లికి అంటుకున్న రసాయనాలు చాలా ప్రమాదకరమైనవి అని భయపడుతున్నారు అధికారులు. దానిని ముట్టుకున్న.. లేదా ఆ వాసనను పీల్చినా కూడా శరీరంపై వెంటనే వాపు, దద్దుర్లు వస్తాయట. దీని వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువే అంటున్నారు. అయితే ఈ పిల్లి బతికి ఉందా? రసాయన తీవ్రతకు చనిపోయిందో తెలియదు.

నోమురా మెక్కి బుకుమా ఫ్యాక్టరీ మేనేజర్ కో బై యాషి మాట్లాడుతూ.. కార్మికులు పనికి వచ్చినప్పుడు రసాయనాన్ని కప్పి ఉంచిన షీటు చినిగిపోయిందని గుర్తించారట. అప్పుడే అది పిల్ల వల్ల జరిగింది అని తెలుసుకున్నారట. అయితే ఫ్యాక్టరీలో కార్మికులు రక్షణ కలిగిన దుస్తులనే ధరిస్తారని.. ఇప్పటికి ఎవరికి ప్రమాదాలు జరగలేదు అంటున్నారు. మరి ఈ పిల్లి ఉందో చనిపోయిందో తెలియాలంటే మరో అప్డేట్ రావాల్సిందే..