Bihar: అంధులకు ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. శద్దాలను గ్రహిస్తారు. ఏ శబ్దమో గుర్తిస్తారు. స్పర్శతో వస్తువుల పేర్లు చెబుతారు. అయితే మనలా పనులు చేయలేరు. మత్సకార కుటుంబంలో పుట్టిన ఓ అంధుడు మత్స్యకారుడిగా జీవనం సాగిస్తున్నాడు. కళ్లు కనిపించకపోయినా నీటిలో మునిగిపోతున్న 13 మందికి కాపాడి రికార్డు సృష్టించాడు. 14కుపైగా మృతదేహాలను నీళ్లలో నుంచి బయటకు తీశాడు.
బిహార్‌కు చెందిన అతడు పుట్టుకతోనే అంధుడు. మాట, స్పర్శతో అందరినీ, అన్నింటనీ గుర్తిస్తాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో తెలివితేటలు కలగిని అతడి వయసు ప్రస్తుతం 35 ఏళ్లు. మత్స్యకార కుటుంబంలో పుట్టిన ఇతడు అదే పనిచేసుకూంటు జీవనం సాగిస్తున్నాడు. కేవలం చేపలు మాత్రమే పట్టకుండా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోతున్న 13 మందిని కాపాడాడు. అసలైన హీరో అనిపించుకున్నాడు. చెరువులు, నదుల్లో పడి చనిపోయిన వారిని కళ్లుండి గుర్తించలేని తోటి మత్స్యకారులతో పోటీపడి మృతదేహాలను వెలికి తీశాడు. జల యోధడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బిహార్‌కు చెందిన సమస్తిపూర్ జిల్లా దుమ్‌దుమా గ్రామానికి చెందిన 35 ఏళ్ల భుల్లు సాహ్ని పుట్టుకతో అంధుడు. చదువుపై పెద్దగా దృష్టి సారించలేదు. స్పర్శ, వినికిడితో మనుషులను గుర్తుపడతాడు. కేవలం మనుషులనే కాదు అన్నీ గుర్తిస్తాడు. అయితే మత్స్యకార కుటుంబంలో పుట్టడంతో అతని తండ్రి కైలు సాహ్ని చిన్నప్పటి నుంచే భల్లుకు చేపలు పట్టడం నేర్పించాడు. ఈత కొట్టడం నేర్పించాడు. ఇలా భల్లూ ఈ కళలో మంచి ప్రావీణ్యం సంపాదించాడు. ఈత కొడుతూ ఎంత దూరమైనా ప్రయాణిస్తాడు. ప్రస్తుతం చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఐదేళ్లలో 13 మందిని కాపాడాడు..
భల్లూ చేపలుట్టడంతోపాటు ఇతర చిన్నచిన్న పనులు చేస్తాడు. గడిచిన ఐదేళ్లలో 13 మందిని కాపాడి రికార్డు సృష్టించాడు. ఏదైనా పడవ మునిగిపోవడం, ప్రమాదవశాత్తు నీళ్లలో పడడం వంటివి జరిగితే వెంటనే స్పందిస్తాడు. ఎవరైనా నీటిలో పడితే చాలా మంది భల్లూనే సంద్రిస్తారు. ఎంతో ప్రావీణ్యం ఉన్న భల్లూకు కళ్లు కనిపించకపోయినా నీటిలో ఉన్న మనుషులను గుర్తిస్తాడు. అలా 13 మంది ప్రాణాలు కాపాడాడు. ఇక కళ్లు ఉన్నవారు కూడా గుర్తించలేని వశాలను భల్లూ నీటిలో నుంచి వెలికి తీశాడు. ఎంతటి ప్రమాదమైనా, ప్రవాహదమైనా జంకకుండా నీటిలో దిగుతాడు. ప్రాణాలు కాపాడతాడు. కాపాడినందుకు రూ.1,500 నుంచి రూ.2 వేల వరకు ఇస్తారట. మృతదేహాలు వెలికి తీసినా అంతే మొత్తం తీసుకుంటాడట. నీటిలో మనుషులు ఉన్నచోట తనకు ఏదో మెచిసినట్లు అనిపిస్తుందని తెలిపాడు. తనకు దేవుడు ప్రసాదిం ఇన విద్యతోనే పలువురిని కాపాడానని తెలిపాడు.