https://oktelugu.com/

Sullurupeta: ఆడపిల్ల పుడుతుందని.. నిండు గర్భిణీని రైలు ఎక్కించి భర్త పరార్

బీహార్ కు చెందిన యబాబీ, మదీనా దంపతులు బెంగళూరులో జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ తరుణంలో మదీనా గర్భం దాల్చింది.

Written By:
  • Dharma
  • , Updated On : October 20, 2023 / 04:11 PM IST

    Sullurupeta

    Follow us on

    Sullurupeta: సృష్టిలో భార్యాభర్తలది అద్భుతమైన బంధం, అనుబంధం. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి అయినవారిని వదులుకొని భర్త నీడకు చేరుకుంటుంది భార్య. ఆయనే సర్వస్వం అనుకుని జీవిస్తుంది. మరి అటువంటి భార్యనే మోసం చేస్తే దానిని ఏమనాలి? నిండు చూలాలు అని చూడకుండా ఒంటరిగా వదిలేసిన ఆ కర్కశ మనసును ఏమని వర్ణించాలి? నిండు గర్భిణీ రైలు ఎక్కించి భర్త పరారయ్యాడు. ప్రయాణంలో పురిటి నొప్పులు, ప్రసవ వేదనతో బాధపడిన ఆమె భోగి లోనే ప్రసవించింది. సూళ్లూరుపేటలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

    బీహార్ కు చెందిన యబాబీ, మదీనా దంపతులు బెంగళూరులో జీవనోపాధి పొందుతున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ తరుణంలో మదీనా గర్భం దాల్చింది. ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భిణీ ఆమె. దీంతో గురువారం దంపతులిద్దరూ పిల్లలతో కలిసి సొంతూరు బయలుదేరారు. బెంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ లో వారిని ఎక్కించిన భర్త.. తాగునీరు తెస్తానని చెప్పి వెళ్ళాడు. రైలు బయలుదేరుతున్నా.. భర్త రాకపోయేసరికి ఆమె చేసేది లేక ఇద్దరు పిల్లలతో భోగి లోనే ఉండిపోయింది.

    రైలు సూళ్లూరుపేట, చెన్నై స్టేషన్లో మధ్యలోకి వచ్చేసరికి మదీనాకు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు సూళ్లూరుపేట రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. రైలు సూళ్లూరుపేట వచ్చేసరికి ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న 108 సిబ్బంది ఆమెను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

    ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. వివరాలపై ఆరా తీశారు. ఇప్పటికే తమకు ఇద్దరు ఆడపిల్లలు ఉండడంతో భర్త ఆవేదనతో ఉన్నాడని.. మరోసారి ఆడపిల్ల పుడుతుందని భావించి తమను విడిచిపెట్టి పరారయ్యాడని మదీనా కన్నీటి పర్యంతమైంది. రైల్వే పోలీసులు భర్తను రప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. కాకా యశ్వంతపూర్ ఎక్స్ప్రెస్ కు సూళ్లూరుపేటలో స్టాపింగ్ లేదు. కానీ అత్యవసర పరిస్థితుల్లో రైలును నిలిపివేశారు. ప్రస్తుతం మదీనాతో పాటు ముగ్గురు పిల్లలు సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు.