
Tiger Eats Leopard: మారుతున్న కాలంలో ఆహార కొరత తీవ్రమవుతోంది. కొందరు ధనవంతులు మరింత రిచ్ గా మారుతున్నారు. పేదవారికి పిడికెడు అన్నం దొరకడం కష్టంగా మారుతుంది. ఈ పరిస్థితి మనుషుల్లోనే కాదు.. జంతువుల్లో కూడా ఉంది. పర్యావరణ పరిస్థితుల్లో అనేక మార్పులు రావడంతో పక్షులు, జంతువులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా కొన్ని జంతువులకు ఆహారం దొరకక అల్లాడిపోతున్నాయి. దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కడుపు నింపుకోవడానికి తమ జాతి జంతువులనే భక్షిస్తున్నాయి. లేటేస్టుగా ఓ చిరుతపులిని చంపి పెద్దపులి తింటున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఓ కెమెరామెస్ సాహసం చేసి దీనిని క్యాప్షర్ చేశారు.
సాధారణంగా ఒక జాతి జంతువులు తమ పిల్లలను తినలేవు. అలాంటి పరిస్థితుల్లో అడవుల్లో ఉంటాయి కావచ్చు. కానీ ఓ జూపార్క్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ పెద్దపులికి ఆహారం దొరకలేదో.. ఇంకెదో తెలియదు. కానీ తన జాతికి చెందిన చిరుతపులిని చంపి తినడం అరుదైన దృశ్యంగా భావిస్తున్నారు. బెంగుళూరుకు చెందిన వైల్డ్ ఫొటోగ్రాఫర్ హర్ష నరసింహమూర్తి ఈ ఫొటోలను క్యాప్షర్ చేశాడు.
రాజస్థాన్ లోని రణధంబోజ్ నేషనల్ పార్క్ లో జరిగిన ఈ ఘనటపై షూట్ చేయడానికి ఫొటోగ్రాఫర్ సాహసమే చేయాల్సి వచ్చింది. ఓరోజు పార్క్ లోని ఉద్యోగులతో కలిసి పులి అడుగులను అనుసరించారు. అయితే ఒక చోట పులి అడుగులు ఆగిపోయాయి. దీంతో అతడు పులి అక్కడే ఉంటుందన్న విషయాన్ని గ్రహించాడు. అటూ ఇటూ చూడగా ఓచోట పెద్దపులి ఆహారం కోసం చిరుతపులిని చంపి తింటున్నట్లు ఆయనకు కనిపించింది. అయితే ఆ పులి అతనికి 40 నుంచి 50 అడుగుల దూరంలో కనిపించింది. అయినా తన కెమెరాకు అతడు పనిచెప్పాడు.

ఈ దృశ్యాలను ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్యన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. చిరుతను తినే పులిని ఎప్పుడైనా చూశారా? అని క్యాప్షన్ పెట్టాడు. దీనికి ఓ పర్యావరణ వేత్త రిప్లై ఇచ్చాడు. అడవిలో పులులు తనతో పోటీ పడేవారిని తొలగించుకోవాలని చూసుకుంటాయి. అలాంటి సమయంలో పులులుల ఇలాంటి దాడులు చేస్తాయని అంటున్నారు. కానీ కొంత మంది మాత్రం మనుషుల్లాగే జంతువులకు కూడా తిండి దొరకక ఆకలి కేకలు పెడుతున్నాయని కామెంట్లు పెడుతున్నారు.