Women Allergic : భూమ్మీద ఉన్న మనుషుల్లో అనేక రకాలైన వారు ఉన్నారు. ఒకరికి నచ్చిన వస్తువు మరొకరికి నచ్చదు. అలాగే కొన్ని విషయాలు కూడా ఇద్దరు మనుషులతో పోలిక ఉండదు. అలాగే కొందరికి ఆడవాళ్లను చూస్తే గౌరవం ఇస్తారు. కానీ ఈ వ్యక్తి మాత్రం భయపడి ఇంట్లోకి వెల్లి తలుపులేసుకుంటాడట. ఆడవాళ్లను చూడగానే దెయ్యంగా భావించి అతడు వణికిపోతాడట. వింత క్యారెక్టర్ ఉన్న ఈ వ్యక్తి గురించి సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ అతనికి ఆడవాళ్లు అంటే ఎందుకు భయం? అసలేమైంది అతనికి?
రువాండాకు చెందిన 71 ఏళ్ల కాలిలెక్స్ నజాంవిటా గురించి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అతడు చూడడానికి నలుపులో ఉన్నాడు. అంతేకాకుండా వింత మనిషిలా కనిపిస్తున్నాడు. అలాగే అతనికి వింత వ్యక్తిత్తం ఉంది. ఎక్కువగా అడవిలో సంచరించే ఇతనికి ఆడవాళ్లు అంటే చాలా భయం. ఈ భయం అతడు 16 ఏళ్లు ఉన్నప్పుడే మొదలైందట. అప్పటి నుంచి ఎవరు లేడిస్ కనిపించినా వెంటనే ఇంట్లోకి వెల్లి తలుపులు వేసుకుంటాడట.
నజాంవిటా ఆడవాళ్లకు మాత్రమే కాకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్నాడు. అతనికి ఇతర మనుషులు అంటే అస్సలుగిట్టదట. అయితే అతనికి కొందరు ఆహారం అందిస్తు ఉన్నారు. ఇతరులతో ఎక్కువగా కలివిడిగా లేని ఏ పని చేయకుండా ఉండడంతో భోజనానికి సంబంధించిన వస్తువులు ఆడవాళ్లు మాత్రమే తేవడం విశేషం. అయితేవారు వస్తువులను తెచ్చేటప్పుుడు ఇంట్లోకి వెళ్లి వారు ఇంటికి వెళ్లాక ఈయన బయటకు వచ్చి తన వస్తువులను తీసుకుంటాడు.
ఆడవారిపై ఇలా ద్వేషం పెంచుకున్న అతనిపై కొందరు పరిశోధన చేశారు. అతనికి గైనో ఫోబియా అనే వ్యాధి ఉందని కొందరు తేల్చారు. ఆడవారి పల్ల ఉండే అహేతుకమైన భయాన్ని గైనోఫోబియా అంటారు. ది క్లినికల్ సెట్టింగ్ లో దీనిని నిర్దిష్ట భయంగా పేర్కొన్నారు. దీని లక్షణాలు ఏంటంటే ఆడవారిని చూడగానే వీరిలో ఒక రకమైన భయం ఏర్పడుతుంది. వారితో కలిసి పోవడానికి అస్సలు ఇష్టపడదరు. మఉక్యంగా చాతి పట్టేసినట్లు, గుండె కొట్టుకోవడం వంటి లక్షణాలు ఏర్పడుతాయి.