Rat Killing Case : ఎలుకను చంపితే కేసు..30 పేజీల చార్జ్ షీట్.. మరి దోమల్ని చంపవచ్చో లేదా?

Rat Killing Case : ఈ సృష్టిలో ఒక జీవిని మరో జీవి చంపనిదే మనుగడ సాగించలేవు. అలా సృష్టి చక్రం తిరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మనుషులు కూడా అతీతులు కారు. అయితే మానవ సామాజ్యం అత్యంత తెలివితేటలతో ఈ భూమ్మీద మనుగడ సాగించి ఇతర జీవులపై ఆధిపత్యం చెలాయించేవి. ఒకప్పుడు భూమిపై డైనోసార్లదే రాజ్యం. కానీ అవి అంతమయ్యాక చివరకు మానవులదే ఈ రాజ్యమైంది. ఒకప్పుడు అడవుల్లో ఒక జంతువును మరో జంతువు చంపి తినడం […]

Written By: NARESH, Updated On : April 11, 2023 4:44 pm
Follow us on

Rat Killing Case : ఈ సృష్టిలో ఒక జీవిని మరో జీవి చంపనిదే మనుగడ సాగించలేవు. అలా సృష్టి చక్రం తిరుగుతూ వచ్చింది. ఒకప్పుడు మనుషులు కూడా అతీతులు కారు. అయితే మానవ సామాజ్యం అత్యంత తెలివితేటలతో ఈ భూమ్మీద మనుగడ సాగించి ఇతర జీవులపై ఆధిపత్యం చెలాయించేవి. ఒకప్పుడు భూమిపై డైనోసార్లదే రాజ్యం. కానీ అవి అంతమయ్యాక చివరకు మానవులదే ఈ రాజ్యమైంది.

ఒకప్పుడు అడవుల్లో ఒక జంతువును మరో జంతువు చంపి తినడం అది అత్యంత సహజ పరిణామ ప్రక్రియ. మనకు చెడు చేసే పాములను ఇప్పటికీ చంపుతుంటాం. లేదంటే మనం చస్తాం. ఇక దోమల వల్ల అనే రోగాలు వచ్చి ప్రాణాలు పోతుండడంతో వాటిని చంపుతుంటాం. ఎలుకలను అంతే.. వాటిని బోనులో బంధించడమో లేక విషం పెట్టి చంపడమో చేస్తుంటాం. అయితే అలా చేయడం తప్పు అని యూపీ పోలీసులు తేల్చారు. ఎలుకను చంపిన వ్యక్తిపై కేసు పెట్టి ఏకంగా 30 పేజీల ఛార్జిషీట్ వేశారు. ఎక్కడో కాదు మన ఉత్తరప్రదేశ్ లోని బదౌన్ లో ఈ చోద్యం చోటుచేసుకుంది. పోలీసుల చేసిన పనికి ప్రజలంతా అవాక్కవుతున్నారు. ఎలుకను చంపితే కేసు పెట్టి జైలుకు పంపిన పోలీసులు మరి దోమలను చంపితే ఎలాంటి శిక్ష విధిస్తారంటూ కొందరు సెటైర్లు వేస్తుండగా.. మరికొందరు ఇదేం తలతిక్క కేసులంటూ పోలీసులను తిట్టిపోస్తున్నారు.

తాజాగా ఉత్తరప్రదేశ్ బదౌన్ కు చెందిన ఒక వ్యక్తిపై ఎలుకను చంపినందుకు పోలీసులు 30 పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు. అతడు ఎలుకను ఇటుకతో కట్టి కాలువలో ముంచి చంపాడని ఆరోపించారు. అయితే అతడు చంపితే ఎవరూ చూడకపోతే అసలు కేసు ఉండేది కాదు.. జంతు హక్కుల కార్యకర్త వికేంద్రశర్మకు ఎలుకపై ప్రేమ పుట్టుకొచ్చింది. ఈ ఎలుక హత్యాకాండను చిత్రీకరించి మరీ నిందితుడు మనోజ్ కుమార్ ఎలుకను చంపాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎలుకను కాపాడేందుకు శర్మ సైతం బాగానే ట్రై చేశాడట.. కానీ ఊపిరాడక చనిపోయిందట.. అందుకే ఎలుకను చంపిన మనోజ్ పై వికేంద్ర శర్మ కేసు పెట్టాడు. ఈ కేసులో పోస్టుమార్టం నివేదిక, మీడియాలో విడుదలైన వీడియోలు, వివిధ నిపుణుల అభిప్రాయాలు సేకరించి పోలీసులు ఏకంగా 30 పేజీల ఛార్జిషీట్ ను సిద్ధం చేశారు.

ఎలుకను చంపినందుకు కేసు పెట్టి జైలుకు పంపడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా అయితే మరి దోమలు చంపిన వారిని కూడా జైల్లో పెడుతారా? అలా పెడితే ప్రజలు అందరినీ పెట్టాలని ఈ జైల్లు సరిపోవు అంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఇక చికెన్, మటన్ తినే వాళ్లంతా కోళ్లు, మేకలను చంపి తింటున్నారని.. వారిని కూడా అరెస్ట్ చేస్తారా? అంటూ కొందరు నిలదీస్తున్నారు. ఎలుకను చంపిన మనోజ్ తండ్రి మధుర ప్రసాద్ కూడా ఇదే డిమాండ్ చేస్తున్నాడు. ఎలుక, కాకి వంటి వాటిని చంపడం తప్పు కాదని.. హానికర జీవులను చంపవచ్చని .. తన కొడుకుకు శిో పడితే కోళ్లు, మేకలు చంపి తినేవారికి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నాడు.

ఇక జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద నమోదైన కేసుల్లో రూ.10 నుంచి రూ.2000 వరకూ జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష ఉంటుంది. ఐదేళ్ల జైలు, జిమానా కూడా రెండూ విధిస్తారు. పాపం ఇలాంటి కేసులు ఉంటాయని తెలియక మనోడు ఎలుకను చంపి ఇలా అడ్డంగా బుక్కయ్యాడు.