Pawan Kalyan- Nithiin: నితిన్ కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్.. ఇది కదా అసలైన పండగ అంటే!

Pawan Kalyan- Nithiin: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వారిలో యంగ్ హీరో నితిన్ ముందు ఉంటాడు. ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన ప్రతీ సినిమాలో ఎదో ఒక సందర్భం లో నితిన్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తాడు.ఇప్పుడు ఆయన చెయ్యబోతున్న సినిమాలో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తో నిండిపోయి ఉంటుందట. ప్రస్తుతం […]

Written By: Vicky, Updated On : April 11, 2023 5:14 pm
Follow us on

Pawan Kalyan- Nithiin

Pawan Kalyan- Nithiin: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి టాలీవుడ్ సెలబ్రిటీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. వారిలో యంగ్ హీరో నితిన్ ముందు ఉంటాడు. ఈయనకి పవన్ కళ్యాణ్ అంటే ఎంత అభిమానమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తన ప్రతీ సినిమాలో ఎదో ఒక సందర్భం లో నితిన్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకొస్తాడు.ఇప్పుడు ఆయన చెయ్యబోతున్న సినిమాలో కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్ రిఫరెన్స్ తో నిండిపోయి ఉంటుందట.

ప్రస్తుతం ఆయన వక్కంతం వంశీ దర్శకత్వం లో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం లో ఆయన జూనియర్ ఆర్టిస్టు గా కనిపించబోతున్నాడు. వరుస హిట్స్ తో టాలీవుడ్ లో బులెట్ లాగ దూసుకుపోతున్న శ్రీలీల ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకున్న ఈ సినిమాలో నితిన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా కనిపించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది.

Pawan Kalyan- Nithiin

ఎన్నో సందర్భాలలో నితిన్ పవన్ కళ్యాణ్ సినిమాలో చిన్న జూనియర్ ఆర్టిస్ట్ రోల్ వచ్చినా చేస్తాను అని చెప్పాడు. కానీ వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఇప్పుడు వక్కంతం వంశీ తో నితిన్ చేస్తున్న సినిమాలో పవన్ కళ్యాణ్ రెండు నిమిషాల నిడివి ఉన్న అతిథి పాత్ర పోషించబోతున్నాడని తెలుస్తుంది. ఒక అభిమానిగా, జూనియర్ ఆర్టిస్టు గా నితిన్ పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్ లో పాల్గొంటాడని,ఆ సన్నివేశాన్ని త్వరలోనే చిత్రీకరించబోతున్నారంటూ సోషల్ మీడియా లో కాసేపటి క్రితమే ఈ వార్త వచ్చింది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే ఈ చిన్న సన్నివేశాన్ని కూడా తీసేస్తారట. అలా పవన్ కళ్యాణ్ ఈ చిత్రం లో అతిథి పాత్ర పోషిస్తే మూవీ బిజినెస్ రేంజ్ మారిపోతుందని మూవీ యూనిట్ కూడా అభిప్రాయ పడుతుంది.