Homeట్రెండింగ్ న్యూస్Madhyapradesh - Satna District : 30 ఏళ్ల పడుచుపిల్లకు కడుపు చేసి..  ముసలోడే కానీ...

Madhyapradesh – Satna District : 30 ఏళ్ల పడుచుపిల్లకు కడుపు చేసి..  ముసలోడే కానీ మహానుభావుడు

Madhyapradesh – Satna District : ఆరు పదుల వయసులో ఒంటిలో సత్తువ తగ్గలేదు. శృంగారంపై మమకారం పోలేదు. ఆపై ఆమె సహకరించడంతో పనికానిచ్చేశాడు. ముదిమి వయసులో ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు.  కామన్ గా ఈ వయసు వారికి రుగ్మతలు, అనారోగ్య సమస్యలు తెలెత్తుతాయి. కానీ ఈ వృద్ధుడి విషయంలో అటువంటిదేమీ లేవు. అందుకే భార్యే ఈ సాహస ప్రయత్నానికి పురిగొల్పింది. ఆమె సహకారంతో ఓ యువతిని తల్లి చేశాడు.ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఈ వార్త. అయితే ఈ న్యూస్ విషయంలో ఒక లుక్కెయ్యాల్సిందే.

మధ్యప్రదేశ్ లోని సాత్నా జిల్లా ఉచెహ్ర మండలం అతర్వేదియా ఖుర్ధు గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహకు 62 సంవత్సరాలు. ఆయన భార్య కస్తూరిబాయికి 60 సంవత్సరాలు. వీరికి 18 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. కుటుంబ జీవనం హాయిగా గడిచిపోయేది. ఉన్న ఒక్కగానొక్క కుమారుడ్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తున్నారు. అయితే ఓ రోడ్డు ప్రమాదంలో కుమారుడు మృత్యువాత పడ్డాడు. అప్పటి నుంచి దంపతులిద్దరూ మనోవేధనకు గురయ్యారు. కుమారుడ్ని తలచుకొని కన్నీటిపర్యంతమయ్యేవారు. ముఖ్యంగా తండ్రి విలవిల్లాడిపోయాడు. ఆ సమయంలోనే తల్లి కస్తూరిబాయి ఒక ఆలోచన చేసింది.

భర్త గోవింద కుష్వాహ సాధారణ స్థితికి చేరుకోవాలంటే పిల్లలు లేని లోటుతీర్చడమే మంచిదన్న స్థిర నిర్ణయానికి వచ్చింది. తానే దగ్గరుండి వీరాబాయి అనే 30 ఏళ్ల యువతితో వివాహం జరిపించింది. 62 ఏళ్ల వయసులో గోవింద కుష్వాహ ఏం చేస్తాడు? అని అంత గేలి చేశారు. అటు కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పెళ్లికి ఒప్పుకున్న వీరాబాయి కుటుంబసభ్యులు కూడా బాధపడ్డారు. కానీ గోవింద కుష్వాహ మాత్రం తాను అనుకున్నది సాధించాడు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు పిల్లలను పుట్టించి శభాష్ అనిపించాడు. అయితే పిల్లల బరువు తక్కువగా ఉండడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో  చేర్పించి వైద్యసేవలు అందిస్తున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version