Pydimarri Venkata Subbarao : భారతీయ సంస్కృతిలో, విద్యార్థుల దినచర్యలో మన జాతీయ గీతం, జాతీయ గేయం భాగం. ఈరెండింటితోపాటు ప్రతిజ్ఞ కూడా నిత్యకృత్యం. జాతీయ గీతం పాఠశాలలతోపాటు చట్ట సభలు, వివిధ అధికారిక కార్యక్రమాలతోపాటు ప్రస్తుతం సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలోనూ పాడుతున్నారు. ఇక జాతీయ గేయం వందేమాతరం పాఠశాలల్లో నిత్యం ఆలపిస్తున్నారు. కొన్ని ప్రత్యేక కార్యక్రమాల్లోనూ వందేమాతరం పాడుతున్నారు. వందేమాతరం రాజకీయ నాయకులకు ఒక నినాదంగా కూడా మారింది. ఇక ప్రతిజ్ఞ.. ఇది కూడా విద్యార్థి నిత్య కృత్యం పాఠశాల దశలో ప్రతీ విద్యార్థి రోజు చేయాల్సిందే.
చరయితలు.. నేపథ్యం..
జాతీయ గీతం జనగణమన రచయిత ఎవరంటే చాలా మంది టక్కున చెబుతారు. విద్యార్థులకు అయితే తప్పక గుర్తుంటుంది. ఇక నేతల విషయం వేరు.. చాలా మందికి జనగణ మన పాడడమే రాదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కవి, రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని రచించారు. స్వాతంత్య్రం వచ్చాక దానిని జాతీయ గీతంగా ప్రకటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనతోపాటు అనేక రచనలు చేశారు. ఆయన చాసిన గీంతాంజలి రచన ప్రఖ్యాతి చెందింది. 1913లో ఆయనను నోబుల్ ప్రైజ్ కూడా వరించింది.
– జాతీయ గేయం వందేమాతరం రాసింది కూడా బెంగాల్ రచయితే. బెంగాలీ కవి, వ్యాస రచయిత, సంపాదకుడు అయిన బంకీంచంద్రచటోపాధ్యాయ వందేమాతర గేయం రాశాడు. విద్యార్థులకు ఈ విషయం తెలుసు. ఇతను రాజిన ఆనంద్ మuŠ‡ అనే నవల నుంచి వందేమాతర గేయాన్ని సంగ్రహించారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో వందేమాతర నినాదం సమరశంఖమైంది. ప్రస్తుత రాజకీయ నేతలు కూడా వివిధ ఉద్యమాల సమయంలో వందేమాతరం అంటూ నినదిస్తుంటారు.
ప్రతిజ్ఞ : భారత దేశం నా మాతృభూమి.. భారతీయులంతా నా సహోదరులు అంటూ ప్రతీ పాఠశాలలో విద్యార్థులు ఉదయం ప్రతిజ్ఞ చేస్తుంటారు. ప్రతిజ్ఞ అయితే చేస్తుంటారు కానీ, ఈ ప్రతిజ్ఞ ఎవరు రాశారో చాలా మందికి తెలియదు. పాఠ్యపుస్తకాల్లో ముందు పేజీల్లో జాతీయ గీతం జనగణమన, జాతీయ గేయం వందేమాతరంతోపాటు ప్రతిజ్ఞ ఉంటుంది. జాతీయ గీంత, జాతీయ గేయం కింద రచయిత పేరు ఉంటుంది. కానీ ప్రతిజ్ఞ రచయిత పేరు ఎక్కడా కనిపించదు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు చెప్పరు. వాస్తవంగా చాలా మంది ఉపాధ్యాయులకు రచయిత ఎవరో కూడా తెలియదు.
రాసింది తెలంగాణ బిడ్డే..
ప్రతీ రోజూ విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ రాసింది మన తెలంగాణ బిడ్డే. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచినా ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల వేళ ఆయన గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ వాసులుగా మనపై ఉంది. నల్లగొండ జిల్లా అన్పెర్తికి చెందిన పైడిమర్రి వెంకటసుబ్బారావు ప్రతిజ్ఞ రాశారు. భారతదేశంపై, భారతీయులపై ఉన్న అపారమైన భక్తి, సోదరభావం, ప్రేమతో వెంకటసుబ్బారావు ఈ ప్రతిజ్ఞ రాశారు. విద్యార్థి దశలోనే పిల్లల్లో దేశభక్తి, భారతీయులపై సోదరభావం, మాతృభూమిపై ప్రేమ, దేశ సంపద పరిరక్షణ బాధ్యత చేపట్టాలన్న సంకల్పంతో ఈ ప్రతిజ్ఞను పాఠ్యపుస్తకాల్లో ముద్రిస్తున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌లో దీనిని అచ్చువేయడంతోపాటు ప్రతీ పాఠశాలలో నిత్యం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ బిడ్డలుగా ప్రతిజ్ఞ రచయిత వెంకటసుబ్బారావును మననం చేసుకుందాం. గౌరవించుకుందాం.