Homeట్రెండింగ్ న్యూస్Thunderbolts: కన్నెర్ర చేసిన ఆకాశం.. అర్ధ గంటలో 5,450 పిడుగులు.. తర్వాత ఏమైందంటే?

Thunderbolts: కన్నెర్ర చేసిన ఆకాశం.. అర్ధ గంటలో 5,450 పిడుగులు.. తర్వాత ఏమైందంటే?

Thunderbolts
Thunderbolts

Thunderbolts: ఆకాశం కన్నేర్ర చేసిందా అన్నట్టుగా పిడుగులు వర్షం కురిపించింది. కుండపోత వానతోపాటు కుండపోతగా పడిన పిడుగులు ఆ ప్రాంత ప్రజలు అల్లాడిపోయారు. ఏం జరుగుతోందో తెలియక ఒక అర్థగంట పాటు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేత పెట్టుకుని బతికారు. అసలు పిడుగులు వర్షం కురవడానికి కారణం ఏంటి..? ప్రజలను భయాందోళనకు గురిచేసిన ఆ పిడుగులు వర్షం ఎక్కడ కురిసిందో ఒకసారి చదివేయండి.

మనం కూడా పిడుగుపాటుకు జనాలు ప్రాణాలు కోల్పోయిన వార్తలు చూస్తూ ఉంటాం కానీ ఒక ప్రాంతంలో ఏకంగా 5450 పిడుగులు పడ్డాయి అది కూడా అరగంట వ్యాధులు

వర్షాకాలంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురవడం చూస్తుంటాం. అలాంటి సమయంలో పలుచోట్ల పిడుగులు కూడా పడుతూ ఉంటాయి. మనం కూడా పిడుగుపాటుకు జనాలు ప్రాణాలు కోల్పోయిన వార్తలను తరచూ చూస్తూ ఉంటాం. కానీ ఒక ప్రాంతంలో ఏకంగా 5450 పిడుగులు పడ్డాయి. అది కూడా అరగంట వ్యవధిలో. పిడుగుపాటు శబ్దాలకు భూమి దద్దరిల్లింది. ప్రజలు భయంతో పరుగులు పెట్టారు. ఇంతకూ ఈ ఘటన ఎక్కడ జరిగిందో ఒకసారి చూసేద్దాం.

ఒడిశా లోని భద్రక్ జిల్లా బాసు దేవపూర్ లో బుధవారం సాయంత్రం ఆకాశం కన్నెర్ర చేసింది. కేవలం అరగంట వ్యాధులు 5450 పిడుగులు పడిపోయాయి. వరుసుగా పిడుగులు పడడంతో జనాలు దిక్కు తోచక పరుగులు పెట్టారు. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దిక్కు మిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఆ అరగంట సేపు ఏర్పడింది. ప్రాణ ఆస్తి నష్టం లేకపోయినప్పటికీ పిడుగుపాటు శబ్దాలకు బాసుదేవపూర్ ప్రజలు భయాందోళన చెందారు.

రాపిడికి గురి కావడంతో పిడుగులు..

గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు భయాందోళన చెందేలా పిడుగులు పడిన వ్యవహారంపై అధికారులు స్పందించారు. ఈ పిడుగులు పడిన దానిపై ఐఎండి అధికారులు వివరిస్తూ.. క్యుములో నెంబస్ మేఘాలు రాపిడికి గురైనప్పుడు ఇలా జరుగుతుందని గోపాల్ పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం (ఐఎండి) అధికారి ఉమా శంకర్ దాస్ తెలిపారు. ఇలా భారీ స్థాయిలో పిడుగులు పడడం మొదటిసారి కాదని, గతంలో కూడా జరిగాయని అధికారులు తెలిపారు. పిడుగుపాటును గుర్తించే అత్యాధునిక సాంకేతికత రాధా తమ కేంద్రానికి ఉందని ఆయన వెల్లడించారు. ఏదిఏమైనా ఇలా పిడుగులు పడడంతో జనాలు వెన్నులో వణుకు పుట్టింది.

Thunderbolts
Thunderbolts

ప్రాణాలను హరించే పిడుగులు..

సాధారణంగా వర్షాకాలంలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తుంటాయి. అయితే కొన్ని చోట్ల భారీ స్థాయిలో పడే పిడుగులు ప్రాణాలను హరిస్తుంటాయి. పిడుగులు పడినప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తుంటారు. ముఖ్యంగా వర్షాలు పడుతున్నప్పుడు చెట్ల కింద ఉండొద్దని హెచ్చరిస్తుంటారు. అయితే పిడుగులు ఎక్కడెక్కడ పడతాయో వాతావరణ నిపుణులు ముందుగానే హెచ్చరిస్తుంటారు. అందుకు అనుగుణంగా ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది.

Exit mobile version