Sudarsan Pattnaik: దేశవ్యాప్తంగా ప్రజలందరు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో దీపావళి ఒకటి. అశ్వయుజ మాసంలో నరక చతుర్తి రోజున జరుపుకునే దీపాల పండుగకు ఎంతో విశిష్టత ఉంది నియమ నిష్టలతో ప్రతి ఒక్కరు తమ ఇంటిలో లక్ష్మీదేవిని కొలుస్తుంటారు. ఈ నేపథ్యంలో నేడు ఆనందోత్సాహోలతో నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతి ఇంటిలో లక్ష్మీదేవి కొలువుండాలని పూజలు చేయడం పరిపాటే. ఉదయాన్నే మేల్కొని స్నానాలు చేసి దేవాలయాలు సందర్శించి దేవుళ్లను కొలవడం చేస్తుంటారు. తమ ఇంటిలో సకల శుభాలు, అష్ట ఐశ్వర్యాలు కలగాలని ప్రతి ఒక్కరు దేవుళ్లను పూజిస్తారు.

ప్రతి పండగకు ఒడిశాకు చెందిన సైకత శిల్పకారుడు సుదర్శన్ పట్నాయక్ ఏదో ఒక ప్రత్యేక రూపంలో శిల్పం తయారు చేస్తుంటారు. దీపావళికి కూడా ఓ ప్రత్యేకత చూపించారు. అందరిని ఆకర్షించేలా కళాఖండం సృష్టిస్తూ అందరిని అబ్బురపరుస్తుంటారు. తన చేతివాటంతో ఎన్నో వైవిధ్యమైన శిలలు తయారు చేసి ఆశ్చర్యపరుస్తుంటారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పూరీ సముద్ర తీరంలో 4045 దీపాంతలతో కాళీమాత సైకిత శిల్పం ఏర్పాటు చేయడంతో జనం ఎగబడి చూస్తున్నారు.
వెలుగుల పండుగ మన ఇంటిలో మరిన్ని కాంతులు నింపాలని కోరుకుంటారు. ఇందులో భాగంగానే ఇంటిల్లిపాది సంతోషంతో పండగను జరుపుకోవడం సాధారణమే. ఈ నేపథ్యంలో సుదర్శన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన శిల్పం అందరిని ఎంతో ఆకర్షిస్తోంది. ప్రతికూలతలు దూరమై అన్ని అనుకూలతలు మనకు కలగాలని ఆశిస్తుంటాం. దీపాల కాంతుల్లో బాణసంచా కాలుస్తూ ఆనంద పరవశులవుతుంటారు. దేశం యావత్తు పండుగను ఘనంగా జరుపుకోవడంతో ఆనందాలు విరగబూస్తాయి.

కాలుష్య రహితంగా పండుగ జరుపుకోవాలి. దీపాలు వెలిగించేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. అంతే కాని బాంబుల మోతతో పరిసరాలను అపరిశుభ్రం చేయకూడదు. పర్యావరణ పరిరక్షణ కోసం మన వంతు కర్తవ్యంగా బాంబులకు దూరంగా ఉంటేనే ప్రయోజనం. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంతో బాంబులు విచ్చలవిడిగా వినియోగిస్తూ కాలుష్యాన్ని పెంచుతున్నారు. పండుగ వేళ అనవసర విషయాలు పక్కన పెట్టి దీపాలు వెలిగించి తమలోని భక్తిని చాటుకోవాలని కోరుతున్నారు.