4 hours of makeup for Sunil Shetty : సీనియర్ బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగుతుంది. ప్రస్తుతం ఆయన ‘ధారావి బ్యాంక్’ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ధారావి బ్యాంక్ సిరీస్లో సునీల్ శెట్టి తలైవన్ అనే ప్రధాన పాత్ర చేస్తున్నారు. ముంబై కేంద్రంగా జరిగిన ముప్పై వేల కోట్ల రాబరీకి సంబంధించిన కథే ధారావి బ్యాంక్ సిరీస్. నవంబర్ 19 నుండి ఎమ్ఎక్స్ ప్లేయర్ లో ధారావి బ్యాంక్ స్ట్రీమ్ కానుంది. విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంది. సిరీస్ పై అంచనాలు పెంచేసింది.

కాగా ధారావి బ్యాంక్ సిరీస్లో లో సునీల్ శెట్టి ఇంటెలిజెంట్ ఓల్డ్ థీఫ్ రోల్ చేస్తున్నట్లు సమాచారం. సునీల్ శెట్టిని దర్శకుడు 60 ఏళ్ళు పైబడిన ముసలివాడిగా చూపించాలని భావిస్తున్నారు. వాస్తవంగా సునీల్ శెట్టి ప్రస్తుత వయసు 61 ఏళ్ళు. అయితే చాలా ఫిట్ గా ఉండే సునీల్ శెట్టి అలా కనిపించరు. ఇప్పటికీ ఆయన 40 ఏళ్ల కుర్రాడిలా ఉంటారు. దీంతో సునీల్ శెట్టిని వృద్ధుడిగా చూపించడానికి దర్శకుడు చాలా కష్టపడ్డారట.
అతనికి ప్రోస్థటిక్ మేకప్ వేశారట. సునీల్ శెట్టిని వృద్దుడిగా మలచడానికి ఏకంగా నాలుగు గంటల సమయం పట్టేది అట. ప్రేక్షకులకు సునీల్ శెట్టి వృద్ధుడు అని నమ్మించాడనికి అంతలా కష్టపడ్డారట. ఈ న్యూస్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కొన్నాళ్లుగా ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ప్రోస్థటిక్ మేకప్ వాడుతున్నారు. ఇండియన్ మూవీ నిర్మాణ విలువలు పెరిగిన నేపథ్యంలో సాంకేతికత అందిపుచ్చుకుంటున్నారు.
ప్రోస్థటిక్ మేకప్ పూర్తి లుక్ మార్చేయడానికి ఉపయోగపడుతుంది. సమయం పట్టినప్పటికీ కావలసిన లుక్ సాధించవచ్చు. ఇక ఒకప్పటి బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆయన తెలుగులో రెండు సినిమాలు చేశారు. మంచు విష్ణు హీరోగా తెరకెక్కిన మోసగాళ్లు మూవీలో సునీల్ శెట్టి కీలక రోల్ చేశారు. అలాగే వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా గని మూవీలో నటించడం జరిగింది.