
Nani Dasara Movie: ప్రస్తుతం విడుదల అవ్వబోతున్న పాన్ ఇండియన్ సినిమాలలో మంచి అంచనాలను ఏర్పర్చుకున్న సినిమా ‘దసరా’.న్యాచురల్ స్టార్ నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన ఈ సినిమాని వచ్చే నెల 30 వ తారీఖున అన్ని ప్రాంతీయ బాషలలో విడుదల కానుంది.కెరీర్ లో మొట్టమొదటిసారి ఊర మాస్ అవతార్ లో కనిపించబోతున్న నాని, ఈ సినిమా తన కెరీర్ లో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని బలంగా నమ్ముతున్నాడు.
అంతే కాదు ‘కాంతారా’ మరియు #RRR సినిమాలు ఇతర బాషలలో ఎలా అయితే సెన్సేషన్ సృష్టించాయో, ‘దసరా’ సినిమా కూడా అదే రేంజ్ సెన్సేషన్ సృష్టించబోతుందని చాలా నమ్మకం తో చెప్పాడు.ఈ సినిమా ద్వారా శ్రీకాంత్ ఓడేలా అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.ఔట్పుట్ మీద ప్రగాఢ నమ్మకం ఉండడం తో నాని ఈ సినిమాకి సంబంధించి ప్రతీ ఒక్కటి ఎవ్వరు ఊహించని విధంగా చెయ్యబోతున్నాడు.
ఇప్పటి వరకు సినిమా టీజర్స్ మరియు ట్రైలర్స్ థియేటర్స్ లో ప్రదర్శించడం అనేది చాలా కామన్ విషయం, నాని ‘దసరా’ టీం కూడా అదే చేయబోతుంది, కానీ ఈసారి వినూతన రీతిలో అన్నమాట.ఈరోజు నుండి మార్చి 30 వ తేదీ వరకు సరిగ్గా 39 రోజులు ఉన్నాయి.ఈ 39 రోజులకు థియేటర్స్ లో స్క్రీన్ మీద టీజర్ పడేటప్పుడు కౌంట్ డౌన్ ఉంటుందట.ఆ విధంగా ఒక సరికొత్త రీతిలో ఈ సినిమాని ప్రమోట్ చేయబోతుంది మూవీ టీం.ఈ ప్రమోషన్ సక్సెస్ అయితే భవిష్యత్తులో అందరూ ఇదే ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా , సముద్ర ఖని ,సాయి కుమార్ తదితరులు ముఖ్యపాత్ర పోషించారు.ఈమధ్యనే విడుదలైన ఈ సినిమా టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, మొదటి పాట కూడా సూపర్ హిట్ అయ్యింది.చూస్తూ ఉంటే ఈ సినిమా నాని చెప్పినట్టుగానే ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని అనిపిస్తుంది.చూడాలి మరి.
