
దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో నిరుద్యోగం రేటు రోజురోజుకు పెరుగుతోంది. అర్హతకు తగిన ఉద్యోగం దొరకక ఏదో ఒక ఉద్యోగంలో చేరేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నెలకు కనీసం 10,000 రూపాయల జీతం వచ్చినా చాలు అనుకునే వాళ్లు దేశంలో చాలామంది ఉన్నారు. అయితే లండన్ లో ఒక కంపెనీ మాత్రం డాగ్ వాకర్ ఉద్యోగానికి ఏకంగా 29 లక్షల రూపాయల వేతనం ప్రకటించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఉద్యోగం నిరుద్యోగులను తెగ ఆకర్షిస్తోంది.
Also Read: మహిళలను వివస్త్రలను చేసిన విమానాశ్రయ అధికారులు.. ఎక్కడంటే..?
పూర్తి వివరాల్లోకి వెళితే లండన్‌లోని ‘జోసఫ్ హేజ్ ఆరోన్‌సన్’ అనే ఒక న్యాయవాద సంస్థ ఉంది. ఆ సంస్థలో పని చేసే ఒక సినీయర్ ఉద్యోగికి పెంపుడు కుక్క ఉంది. ఆ పెంపుడు కుక్కను ఉదయం, సాయంత్రం సమయాల్లో రోడ్లపై తిప్పడానికి డాగ్ వాకర్ అవసరం ఉందని.. ఆ డాగ్ వాకర్ కు ఏకంగా 29 లక్షల రూపాయల వేతనం చెల్లిస్తామని సంస్థ ప్రకటన చేసింది. ఎవరికైతే కుక్కలంటే ఇష్టమో వారు ఈ ఉద్యోగానికి అర్హులని సంస్థ పేర్కొంది.
కుక్కలను ప్రేమగా చూసుకోవడం మినహా ఈ ఉద్యోగానికి మరో అర్హత అవసరం లేదని సంస్థ వెల్లడించింది. ఉద్యోగానికి ఎంపికైన ఉద్యోగి ఉదయం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పూర్తి సమయం కుక్కకే కేటాయించాలి. ఎంపికైన ఉద్యోగికి పెన్షన్, ఆరోగ్య బీమా, జీవిత బీమాలను సంస్థ కల్పిస్తుంది. ఫిట్ నెస్ ఉన్న ఉద్యోగులు ఈ ఉద్యోగానికి అవసరమని.. లండన్ వీధులంతా ఉద్యోగి తిరుగుతూ ఉండాలని కంపెనీ పేర్కొంది.
Also Read: దేశ ప్రజలకు శుభవార్త.. వృద్ధులకూ పని చేస్తున్న ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్..?
సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉద్యోగం చేసే సమయంలో పూర్తి సమయాన్ని కుక్కకే కేటాయించాలని.. శని, ఆదివారాలు వీక్ ఆఫ్ ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వాంటెడ్ పేరుతో ఆ ప్రకటన వెలువడినా ఆ సంస్థ ఆ జాబ్ పోస్ట్ ప్రకటించలేదని.. ఎవరో సంస్థ పేరు చెప్పి ఆ జాబ్ పోస్ట్ ను వైరల్ చేశారని తెలుస్తోంది.