
Yogi Adityanath: ఆరేళ్లలో 183 మంది క్రిమినల్స్ హతం.. ఇందులో 10,900 ఎన్‌కౌంటర్లు.. 23వేలకు పైగా అరెస్టులు.. ఇదీ యూపీ సీఎం యోగి పాలన లెక్క. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. 2017 మార్చిలో యోగి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా.. యూపీ పోలీసుల లెక్కల ప్రకారం ఈ ఆరేళ్లలో రాష్ట్రంలో 10,900కు పైగా ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇందులో 183 మంది క్రిమినల్స్ హతమయ్యారు. 23,300 మంది నేరగాళ్లను అరెస్టు చేయగా వీరిలో 5,046 మంది గాయాలతో పట్టుబడ్డారు. ఇవి అధికారిక లెక్కలు. ఆయా ఎన్‌కౌంటర్లలో 1,443 మంది పోలీసులు గాయపడగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎనిమిది మంది గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరులు కాన్పూర్‌లో చేసిన దాడిలోనే చనిపోయారు. ఇప్పటివరకు ఇదంతా శాంపిల్ మాత్రమేనా..యోగి 2.0 వేరే ఉందా? ఇప్పటిదాకా అడ్డదిడ్డంగా ఎదిగిన కొమ్మలని మాత్రమే నరుక్కుంటూ పోయిన యోగి.. ఇక వేళ్ళు పెకిలించే పనిలో పడబోతున్నాడా? దీనికి అవును అనే సమాధానం ఇస్తున్నాయి ఉత్తరప్రదేశ్ పొలిటికల్ వర్గాలు.
అతీక్ అహ్మద్, అతడి సోదరుడు, కుమారుడు అసద్ హతమైన తర్వాత ఇప్పుడు తెరపైకి కొత్త లెక్కలు వస్తున్నాయి. ఎందుకంటే యోగి ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని సమూలంగా మార్చేయాలి అనుకుంటున్నాడు. 11 వేల ఎన్కౌంటర్లతో ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ సన్యాసి ఏకంగా మాఫియా ఊడల్ని పెకిలించే పనిలో పడ్డాడు.. హక్కుల సంఘాల ఆందోళనలు, సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, యాంటీ బిజెపి పార్టీలు మొత్తుకున్నప్పటికీ యోగి తన దారిలో తాను వెళుతున్నాడు. ఇప్పుడు సాక్షాత్తు ప్రధాని చెప్పినా వినిపించుకునే స్థితిలో లేడు.. అయితే ఉత్తర ప్రదేశ్ ల్యాండ్ ఆర్డర్ స్పెషల్ డిజి ప్రశాంత్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం 61 మంది మాఫియా నేరగాళ్ళ పేర్లతో ఒక జాబితా తయారు చేశారు. అయితే దీనికి యోగి ఆమోద ముద్ర వేయడమే తరువాయి. ఒకవేళ యోగి నుంచి సంకేతాలు వస్తే పోలీసులు ఇక ఆగరు. ఇక పోలీసులు ప్రిపేర్ చేసిన జాబితాలో పశువులను అక్రమ రవాణాకు పాల్పడే వారి నుంచి ఆర్గనైజ్డ్ క్రైమ్ గ్రూప్ ల వరకు ఉన్నారు.. అంటే వీరందరినీ మెడికల్ చెకప్ కోసం జైళ్ళ నుంచి తీసుకురావాల్సి ఉంటుందని అర్థం చేసుకోవాలన్న మాట.
సుల్తాన్ పూర్ కు చెందిన సుధాకర్ సింగ్ లిక్కర్ మాఫియా డాన్. సుల్తాన్పూర్ ప్రాంతాల్లోని అక్రమ ఆల్కహాల్ వ్యాపారం మొత్తం ఇతడిదే. గత ఏడాది లక్షల రూపాయల లిక్కర్ ను ప్రభుత్వం సీజ్ చేసింది. ప్రస్తుతం ఇతడు జైల్లో ఉన్నాడు.
గబ్బర్ సింగ్.. చోరీలకు దందాలకు పాల్పడే ఇతడి పై 56 కేసులు ఉన్నాయి. ఫైజాబాద్, గొండా, సుల్తాన్ పూర్, లక్నో, బహ్రెయిచ్ ప్రాంతాల్లో పేరుమోసిన గూండా.
గుడ్డు సింగ్.. ఇతడి అసలు పేరు సంజయ్ ప్రతాప్ సింగ్. గుడ్డు సింగ్ అని కూడా పిలుస్తుంటారు. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కుండా అనే ప్రాంతం ఇతడు ఊరు. ఇతడు లిక్కర్ డాన్ కూడా.. 12 కోట్ల విలువైన మద్యాన్ని ఇతడి వద్ద పోలీసులు కనిపెట్టారు.
ఉద్దం సింగ్.. యోగి ప్రభుత్వం తొలి దఫా లో లిస్ట్ అవుట్ చేసిన 25 టాప్ క్రిమినల్స్ జాబితాలో ఇతని పేరు కూడా ఉంటుంది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ లో ఇతడు కార్యకలాపాలు సాగిస్తూ ఉంటాడు. మరోవైపు ఇతను చేసిన హత్యల గురించి పోలీసులు జాబితా తయారు చేస్తున్నారు.
యోగేష్ బహదూర.. మీరట్ ప్రాంతానికి చెందిన ఈ క్రిమినల్ ఉదం సింగ్ ప్రత్యర్థి. “గ్యాంగ్ డీ75” ఇతడి మాఫియా పేరు. 40 వరకు రకరకాల సీరియస్ కేసులు ఇతడి పై నమోదయి ఉన్నాయి. ప్రస్తుతం ఈ క్రిమినల్ జైల్లో ఉన్నాడు.

బదాన్ సింగ్ బడ్డూ.. ఇతడిది కూడా పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతమే. హాలీవుడ్ స్టార్లను అనుకరిస్తుంటాడు. నవ్య కేసులు ఇతడిపై నమోదయి ఉన్నాయి. మొదట్లో యోగి ప్రభుత్వం టాప్ 25 క్రిమినల్స్ జాబితా తయారు చేస్తే అందులో ఇతడు కూడా ఉన్నాడు. 2019 నుంచి ఇతడు కనిపించడం లేదు. కనిపిస్తే కేసు ఖతమే అనే అభిప్రాయం ఉంది.
అజిత్ చౌదరి…ఇతను మొరదాబాద్ ప్రాంతానికి చెందినవాడు. అధికారికంగానే 14 కేసులు ఇతడి పై ఉన్నాయి..
ధర్మేంద్ర కీర్తల్.. ఇతడిపై 49 సీరియస్ కేసులు ఉన్నాయి. అందులో 15 మర్డర్ కేసులే. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇతడిని 2021లో డెహ్రాడూన్ లో పట్టుకుంది.
సునీల్ రాతీ..భాగ్ పట్ ఏరియాకి చెందిన ఇతడు పెద్ద మాఫియా డాన్..ఇతడు టాప్ జాబితాలో ఉన్నాడు.. ఇతడు జైల్లో ఉన్నప్పటికీ మున్నా బజరంగీ అనే వ్యక్తిని చంపినట్టు సమాచారం.
అభిషేక్ సింగ్.. ఇతడు ఐడి 23 గ్యాంగ్ కు లీడర్. ఇతడి పై 20 వరకు మర్డర్, దోపిడీ కేసులు ఉన్నాయి.
నిహాల్.. డీ 46 గ్యాంగ్ లీడర్ ఇతడు. ప్రయాగరాజ్ ఏరియాలో దుమన్ గంజ్ నివాసి. 24 కేసులు ఇతడి పై ఉన్నాయి. మొదట్లో ఎక్సైజ్ యాక్ట్ కింద బుక్ చేశారు. ప్రస్తుతం ఇతడు పరారీలో ఉన్నాడు.
రాజన్ తివారి.. గోరఖ్పూర్ జిల్లాకు చెందినవాడు. దారిలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2019 లోక్సభ ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆ తర్వాత పార్టీ నుంచి విడిపోయాడు.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
సుధీర్ కుమార్ సింగ్.. బహుజన సమాజ్వాది పార్టీకి చెందినవాడు.. 26 కేసులు తన మీద ఉన్నాయి.
వినోద్ ఉపాధ్యాయ.. ఇతని స్వస్థలం గోరఖ్పూర్. పలు పోలీస్ స్టేషన్ లో 25 ఫిర్యాదులు ఉన్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.
రిజ్వాన్ జహీర్.. సమాజ్వాది పార్టీ లీడర్.. 14 కీలక కేసులు ఉన్నాయి. వాటిల్లో మర్డర్ కేసులు కూడా ఉన్నాయి.
దిలీప్ మిశ్రా.. టాప్ 25 క్రిమినల్స్ జాబితాలో ఇతడి పేరు కూడా ఉంది.. ప్రస్తుతం జైల్లో ఉన్నాడు.. అయితే చాలామంది యోగి లిస్టులో ముస్లింలే ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కానీ అది అబద్ధమని ఈ లిస్టు నిరూపిస్తోంది..కానీ అందరికీ తన మార్క్ మెడికల్ చెకప్ సాధ్యం కాకపోవచ్చు. కానీ యోగి కోరుకుంటున్నది అది కాదు. స్వచ్ఛ ఉత్తరప్రదేశ్!
Every word is turning out to be true…
Yogi ji Roxxx ❤️❤️ pic.twitter.com/55wE4QiWn2— INFERNO (@SmokingLiberals) April 13, 2023