Supermoon 2023: ఆకాశంలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. చల్లటి వాతావరణాన్ని అందించే చంద్రుడు ఒక్కోసాని మన నెత్తిమీదకు వచ్చాడా? అన్నట్లు కనిపిస్తోంది. ప్రతీ సంవత్సరం చంద్రుడు కొన్ని ప్రత్యేక రోజుల్లో భూమికి అతి దగ్గరగా వస్తుంటాడు. ఇలా వచ్చినప్పుడు ‘సూపర్ మూన్’ అని అంటారు. 2023 సంవత్సరంలో సూపర్ మూన్ 4 సార్లు కనిపిస్తుంది. వీటిలో మొదటిది జూలై 2023 3న కనిపించనుంది. ది ఓల్డ్ ఫార్మర్స్ ప్రకారం సాయంత్ర 7:39 నిమిషాలకు హెరిజోన్ దిగువన ఉంటుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. సూర్యడు అస్తమించిన తరువాత భూమికి ఆగ్నేయం వైపు చూస్తే ఈ అద్భుత దృశ్యాన్ని చూడొచ్చని అంటున్నారు.
సూపర్ మూన్ సమయంలో భూమి నుంచి చంద్రుడు 2 లక్షల 24 వేల 895 మైళ్ల దూరంలో ఉంటాడు. సాధారణంగా వేసవి తరువాత వర్షాకాలంలో సంభవించే ఈ అరుదైన దృశ్యాన్ని చూడలేరు. ఎందుకంటే ఆకాశంలో మబ్బులు ఎక్కువగా ఉండడం వల్ల సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం వర్షాలు ఎక్కువగా లేనందను ఆ దృశ్యాన్ని చూడొచ్చని అంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం 5:08 నిమిషాలకు ఆకాశంలో సూపర్ మూన్ కనిపిస్తుందని తెలుపుతున్నారు. అమెరికాలో ఈ సూపర్ మూన్ ను బక్ మూన్ అని కూడా అంటారు. ప్రతీ జూలై మాసంలో మగ జింక కొమ్ములు రాలడం తిరిగి, పెరగడం జరుగుతుంది. ఈ సమయంలో అక్కడి వాళ్లు బక్ మూన్ గా పేర్కొంటారు.
2023 సంవత్సరంలో మొత్తం 13 పౌర్ణమిలు సంభవించనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. జూలై 3న సూపర్ మూన్ వస్తుండగా.. ఆగస్టులో బ్లూ మూన్ కనిపిస్తుంది. అయితే అంతకంటే ముందు 1వ తేదీన స్టర్జన్ మూన్, 30న బ్లూ మూన్ ఆకాశంలో ఆవిష్కృతమవుతాయి. ఆ తరువాత సెప్టెంబర్ నెలలో 29న హర్వెస్ట్ మూన్ , అక్టోబర్ 28న హంటర్ మూన్ , నవంబర్ 27న బీవర్ మూన్, డిసెంబర్ 26న కూల్ మూన్ పేరుతో అద్భుతాలు జరుగుతాయి.
వాస్తవానికి చంద్రుడు భూమి దగ్గరకు వచ్చినప్పుడు దానిని సూపర్ మూన్ అని అంటారు. ఒక బిందువు వద్ద దాని పౌర్ణమి దశకు చేరుకున్నప్పుడు మూన్ పెద్దదిగా కనిపిస్తుంది అని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీలోని అబ్రమ్స్ ప్లానిటోరియం డైరెక్టర్ డాక్టర్ షానన్ స్మోల్ అన్నారు. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఖచ్చితమైన వృత్తం కాదు. అందువల్ల దాని కక్ష్యలో అది భూమి దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది.. అని ఆయన వివరించారు.