1200 Year Old Ship: చార్లెస్ డార్విన్ సిద్ధాంతం జీవ పరిణామక్రమాన్ని వివరించింది. నికోలస్ కోపర్నికస్ సూత్రం సూర్యుడే శక్తికి మూలం అని తెలిపింది. న్యూటన్ నియమం గురుత్వాకర్షణ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఏ విషయమైనా తెలియాలంటే లేదా వెలుగులోకి రావాలంటే పరిశోధన ముఖ్యం. చరిత్ర గురించి తెలియాలంటే నాటి ఆనవాళ్లే ప్రామాణికం. డైనోసార్లు ఈ భూమి మీద జీవించి ఉన్నాయని చెప్పడానికి వాటి గుర్తులే కారణం. వాటి ఆధారంగానే శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. కొన్ని వేల సంవత్సరాల క్రితం అవి ఈ భూమ్మీద జీవించాయని తేల్చి చెప్పారు. సరే ఇప్పుడంటే మనం టెక్ యుగంలో ఉన్నాం. దేని గురించి తెలుసుకోవాలన్నా ఒక క్లిక్ దూరంలో ఉన్నాం. సమస్త సమాచారం ఇచ్చేందుకు గూగుల్ రెడీగా ఉంది. అనంతమైన సందేశాలు పంపుకునేందుకు వాట్స్అప్ ఉంది. కడుపులో ఆకలి తీర్చుకునేందుకు స్విగ్గి, జోమాటోలు ఉన్నాయి. కానీ ఒక 1200 సంవత్సరాల క్రితం మనిషి జీవితం ఎలా ఉండేది? అప్పట్లో ఎలాంటి ఆహారం తీసుకునేవాడు? ఎలాంటి వర్తక వ్యాపారాలు సాగేవి? చదువుతుంటే సింగీతం శ్రీనివాసరావు టైం మిషన్ సినిమా గుర్తుకొస్తుందా? లేక ప్రభాస్ ప్రాజెక్టు కే సినిమా స్టోరీ ఇదేనా అని అనుమానం కలుగుతున్నదా? ఇవన్నీ మీకు నివృత్తి కావాలంటే ఒకసారి ఈ కథనం చదవండి. సింగీతం శ్రీనివాసరావు స్థాయిలో కాకున్నా.. వెంకట్ ప్రభు మానాడు సినిమాలో చూపించినట్టు టైం లూప్ లోకి మాత్రం తీసుకెళ్లగలం.
_ఇజ్రాయెల్ లో ఓ ఓడను కనుగొన్నారు
ఇజ్రాయెల్ సముద్రతీరంలో ఇటీవల కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఓ ఓడను కనుగొన్నారు. దాన్ని పరిశీలించి చూస్తే ఇప్పటి కాలానికి చెందినది కాదు అని తేలింది. ఆ శాస్త్రవేత్తల బృందానికి మరి కొంతమంది తోడవడంతో పరిశోధన ముమ్మరమైంది. రోజులు గడిచాకా ఆ ఓడ సుమారు 1200 సంవత్సరాల క్రితం నాటిదని తేల్చి పడేశారు. అదేంటి ఒక ఐస్ బర్గ్ ను ఢీకొని అంతటి టైటానిక్ షిప్ మునిగిపోయింది కదా.. మరి ఇదేంటి ఇన్ని సంవత్సరాలైనా ఈ ఓడ ఎందుకు పాడవలేదు అనే సందేహం మీలో వచ్చింది కదా? మాకు అలానే అనిపించింది కానీ అప్పట్లో వస్తువుల తయారీలో ఎంత నాణ్యత పాటించారో ఈ ఓడను బట్టి అర్థం చేసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెప్పేశారు. అయితే ఈ గోడ ఒక వ్యాపారి చెందినదని అందులో ఉన్న ఆనవాళ్ళను బట్టి తెలుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పట్లో ఇజ్రా యెల్ ప్రాంతంలో ఇస్లామిక్ సంస్కృతి కొనసాగేది. ఇది క్రీస్తు శకం ఏడు లేదా ఎనిమిదవ శతాబ్దానికి చెందిన ఓడ అని అందులో ఉన్న ఆడవాళ్లను బట్టి తెలుస్తోంది. ఈ సమయంలో తూర్పు మధ్యధరా సముద్ర ప్రాంతానికి అప్పటి ఇస్లామిక్ పాలకులు రిపబ్లిక్ క్రైస్తవ బైజాంటిన్ సామ్రాజ్యాన్ని అణిచివేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేసేవారు.
ఈ క్రమంలోనే మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగేవి. సైప్రస్, ఈజిప్ట్, టర్కీ, ఉత్తర ఆఫ్రికా, మధ్యధరా సముద్రం తీర ప్రాంతాల్లో ఇస్లామిక్ సంస్కృతిని విస్తరించేందుకు అప్పటి పాలకులు ప్రయత్నాలు చేసేవారు.ఈ క్రమంలోనే తమకు తెలిసిన వాణిజ్యం ద్వారా తమ రాజ్యాలను విస్తరించుకునేవారు. ఆ సందర్భంగా స్థానిక రాజ్యాలను, రాజులను ఓడించేవారు. ఈ ఓడలో ఉన్న ఆనవాళ్ళను బట్టి ఇది ఇస్లామిక్ వ్యాపారికి చెందినదిగా పురావస్తు శాస్త్రజ్ఞులు గుర్తించారు. దీని ద్వారా వివిధ రకాల వస్తువులను రవాణా చేసే వారిని తెలుస్తోంది. ” కేవలం ఇస్లామిక్ రాజ్యంలో మాత్రమే పెద్దపెద్ద ఓడలు ఉండేవి. మధ్యదర సముద్రతీర ప్రాంతంలో వాణిజ్యం అనేది లేదు. మేం చిన్న చిన్న నౌకల మీద ప్రయాణం చేసి ఈ వివరాలు కనుక్కున్నాం” అని హైఫా విశ్వవిద్యాలయం నాటికల్ ఆర్కియాలజిస్ట్ డెబోరా సివికెల్ తెలిపారు. ఈ ఓడ పొడవు 25 మీటర్లు(82 అడుగులు) ఉన్నది. ఇది మధ్యదర సముద్రం నుంచి తూర్పు ఆఫ్రికా ప్రాంతానికి సరుకులతో వెళ్తుండగా అనుకోకుండా తుఫాను చెలరేగి మునిగిపోయిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ ఓడలో శిథిలాలు తొలగిస్తుండగా వారికి కొన్ని కళా ఖండాలు లభించాయి. ఇవే గాక ఫిష్ సాస్, అలీవ్, ఖర్జూర, అత్తి పండ్లు, మధ్య దర సముద్ర తీర ప్రాంత ప్రజల ఆహార ఆనవాళ్లు కనిపించాయి. అయితే సరుకు రవాణాలో కళా ఖండాలు ఎందుకు తీసుకెళ్లారో అంతు చిక్కకుండా ఉంది.