Homeఆంధ్రప్రదేశ్‌Nagababu- ABN Radhakrishna: పవన్ కు 1000 కోట్లు.. ఏబీఎన్ రాధాకృష్ణకు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

Nagababu- ABN Radhakrishna: పవన్ కు 1000 కోట్లు.. ఏబీఎన్ రాధాకృష్ణకు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్

Nagababu- ABN Radhakrishna
Nagababu- ABN Radhakrishna

Nagababu- ABN Radhakrishna: ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియాది ఎప్పటికీ ఒకటే ఆరాటం. తెలుగుదేశం పార్టీ బాగుండాలి. తాము నాలుగు పైసలు వేనుకేసుకోవాలి. నిత్యం టీడీపీ గురించే పరితపిస్తుంటారు. తెలుగునాట మిగతా మీడియాల అభిరుచులు, ప్రాధాన్యతలు ఎప్పడికప్పుడు మారిపోతుంటాయి. తప్ప.. ఎల్లో మీడియాగా అభివర్ణించే సంస్థల అధినేతల తీరు మాత్రం మారదు. ఇప్పుడు చంద్రబాబును మరోసారి అధికారంలోకి తీసుకురావాలన్నదే వారి ప్రయత్నం. అందుకు ఎంతదాకైనా తెగించే వరకూ వెనుకాడరు. టీడీపీ, చంద్రబాబు కోసం అవసరమైతే కాళ్లు పట్టుకుంటారు. లేకపోతే అదే కాళ్లను లాగేసి నిలువునా బోర్లా కొట్టించగలరు. దశాబ్దాలుగా దీనిని వంటపట్టించుకున్న ఎల్లో మీడియా ఇప్పుడు పవన్ ను పలుచన చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో మరింత ముమ్మరం చేసింది.

వచ్చే ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్య. పొరపాటున ఓటమి ఎదురైతే మాత్రం ఆ పార్టీ కోలుకునేందుకు సైతం చాన్స్ ఉండదు. అదే జరిగితే తన కుమారుడికి మంచి రాజకీయ భవిష్యత్ ఇవ్వాలన్న చంద్రబాబు అభిమతం నెరవేరదు. అందుకే ఆయన గట్టిగానే పోరాటంచేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ ఆయనకు ఒక ఆశాదీపంలా కనిపించారు. అందుకే పవన్ ప్రాపకం కోసం చేయని ప్రయత్నం లేదు. అటు వైసీపీని గద్దె దించుతానని పవన్ సవాల్ చేశారు. అందుకు అవసరమైతేఅన్ని పార్టీలను ఒకేతాటిపైకి తీసుకొస్తానని… ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని చెప్పుకొచ్చారు.. ఈ మాటతో చంద్రబాబు శరవేగంగా పావులు కదిపారు. పవన్ ను ఒప్పించే ప్రయత్నం చేశారు. దీంతో టీడీపీ, జనసేనల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది.

Nagababu- ABN Radhakrishna
Nagababu

ఈ తరుణంలో ఎల్లో మీడియాకు పనిపడింది. ఒక వేళ పొత్తులు కుదిరితే పవన్ వల్ల టీడీపీకి లబ్ధి చేకూరాలి కానీ.. పవన్ నాయకుడిగా ఎదగకూడదన్నది ఆ మీడియా భావన. అందుకే పవన్ పై రకరకాల ప్రచారానికి దిగుతోంది. ఆ మధ్యన ఏబీఎన్ రాధాక్రిష్ణ తన వారంతపు కొత్త పలుకులో పవన్ కు బీఆర్ఎస్ అధినేత నుంచి రూ.1000 కోట్ల ఆఫర్ వచ్చిందని.. ఏపీలో ఒంటరి పోరు.. లేకుంటే బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయాలన్నదే ఆ డీల్ సారాంశంగా చెప్పుకొచ్చారు. దీనిపై జన సైనికులు రెస్పాండయ్యారు. రాధాక్రిష్ణ పై విమర్శల జడివాన ప్రారంభించారు. పొలిటికల్ బ్రోకర్ గా అభివర్ణించారు.

తాజాగా దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మీరు కూర్చున్న కొమ్మను మీరే నరుక్కుంటే.. పవన్ కళ్యాణ్‌కు వచ్చే నష్టమేం లేదన్నారు. కింద పడి చచ్చేది మీరే జాగ్రత్త అని హెచ్చరించారు. జర్నలిజం విలువలు లేకుండా తప్పుడు వార్తలు వండి వడ్డించే మీడియా సంస్థలను ఏమని పిలవాలని ప్రశ్నించారు. గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తే.. అవినీతి రాజకీయ నాయకులు ఉక్కిరి బిక్కిర అవుతారేమో గానీ.. నిప్పు లాంటి పవన్ కళ్యాణ్ గురించి రాతలు జాగ్రత్తగా రాయాలని సూచించారు.పవన్‌ కళ్యాణ్‌ మరో పాతికేళ్లపాటు ప్రజల కోసం యుద్ధం చేయగలడన్న నాగబాబు.. మీకు అంత ఓపిక లేదంటూ.. పరోక్షంగా చంద్రబాబు వయసును ప్రస్తావించారు. ఓడిపోతే జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తమకు లేదన్నారు. ప్యాకేజీ, ప్యాకేజీ అంటూ ఇంకెన్నాళ్లు వాగి చస్తారని నిలదీశారు. మిగతా రెండు పార్టీల నాయకులను అదే మాట అనే దమ్ము మీకు లేదంటూ చురకలు అంటించారు.

 

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
US Iran Conflict

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Oktelugu Epaper