Pakistan vs India : నమ్ముకున్న బుమ్రా ఆకట్టుకోలేదు. పైగా దారుణంగా పరుగులు ఇచ్చాడు. మూడు ఓవర్లు వేసి 34 పరుగులు సమర్పించుకున్నాడు. కులదీప్ యాదవ్ రెండు ఓవర్లు వేసి 18 పరుగులు ఇచ్చాడు. అక్షర్ పటేల్ ఒక ఓవర్ వేసి ఎనిమిది పరుగులు ఇచ్చాడు. ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యకుమార్ యాదవ్ కు ఎటువంటి ఆప్షన్ లేకుండా పోయింది. దీనికి తోడు ఫీల్డర్లు క్యాచ్ లు నేలపాలు చేశారు. దీంతో ఏం చేయాలో టీమిండియా సారధికి తెలియకుండా పోయింది. ఈ దశలో నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు సూర్య కుమార్ యాదవ్ ఫ్రెండ్. తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నూటికి నూరు శాతం నిలబెట్టుకున్నాడు.
ఆయూబ్ ఇచ్చిన క్యాచ్ ను కులదీప్ యాదవ్ నేలపాలు చేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో ఆయుబ్ బ్యాట్ ఎడ్జ్ ను తాకి బంతి అమాంతం గాలిలో లేచింది. దానిని అందుకునే క్రమంలో కులదీప్ యాదవ్ తప్పు చేశాడు. విలువైన క్యాచ్ ను వదిలేశాడు. అది టీమిండియా కు అత్యంత ఇబ్బందికరంగా మారింది. వచ్చిన అవకాశాన్ని అయుబ్ వినియోగించుకున్నాడు. 17 బంతుల్లో 21 పరుగులు చేశాడు. అన్నింటికంటే ముఖ్యంగా ఫర్హాన్ తో కలిసి రెండో వికెట్ కు ఏకంగా 48 బంతుల్లో 72 పరుగులు జోడించాడు. ఒకవేళ కులదీప్ యాదవ్ క్యాచ్ గనుక పట్టి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. వాస్తవానికి ఫర్హాన్, ఆయుబ్ టీమిండియా బౌలర్లకు కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కులదీప్ యాదవ్.. ఇలా ఎవరినీ వదలలేదు. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ ఫ్రెండ్ శివం దుబే బంతిని అందుకున్నాడు. కట్టుదిట్టంగా బంతులు వేశాడు. పాకిస్తాన్ బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. అంతే కాదు ప్రమాదకరంగా మారుతున్న ఆయుబ్ ను వెనక్కి పంపించాడు. ఊరించే బంతివేసి అతడిని బుట్టలో వేసుకున్నాడు. తద్వారా పాకిస్తాన్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత స్కోర్ వేగం కాస్త మందగించింది. అనంతరం హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీద ఉన్న ఫర్హాన్ ను కూడా అవుట్ చేసి టీమ్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు శివం దుబే. ఆ క్యాచ్ కూడా సూర్య కుమార్ యాదవ్ పట్టాడు. దీంతో భారత శిబిరంలో ఆనందం వెల్లి విరిసింది.
ఆసియా కప్ లో శివం దుబే కు అవకాశం ఇవ్వడాన్ని క్రికెట్ విశ్లేషకులు తప్పు పట్టారు. కానీ అతడికి సూర్యకుమార్ యాదవ్ అండగా నిలిచాడు. అంతేకాదు తుది జట్టులోకి కూడా అవకాశం కల్పించాడు. వచ్చిన అవకాశాన్ని శివం సద్వినియోగం చేస్తున్నాడు. పాకిస్తాన్ జట్టుతో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా గొప్ప గొప్ప బౌలర్లు చేతులెత్తేసిన వేళ.. శివం దుబే అదరగొట్టాడు. తనకు మాత్రమే సొంతమైన మ్యాజిక్ డెలివరీలు వేసి పాకిస్తాన్ జట్టుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు
A STUNNER FROM ABHISHEK SHARMA…!!!! pic.twitter.com/dxRITovZFv
— Johns. (@CricCrazyJohns) September 21, 2025