India vs Pakistan : ఆసియా కప్ లో భాగంగా సూపర్ 4 లో టీమిండియా, పాకిస్తాన్ తలపడుతున్నాయి. దుబాయ్ లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం లో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా సారధి సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈ కథనం రాసే సమయం వరకు పాకిస్తాన్ జట్టు ఒక వికెట్ కోల్పోయి 91 పరుగులు చేసింది. అనుకున్నట్టుగానే మ్యాచ్ హోరా హోరీగా సాగుతోంది. భారత్ బౌలింగ్ లోపాలను పాకిస్తాన్ జట్టు సద్వినియోగం చేసుకుంటున్నది. ఫీల్డింగ్ లో రెండు క్యాచ్ లు నేలపాలు కావడంతో భారత జట్టు మీద ఒత్తిడి పెరిగిపోయింది. వచ్చిన జీవధానాలను పాకిస్తాన్ ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. తమ శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు.
హోరాహోరిగా సాగుతున్న మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు అత్యంత నాటకీయ పరిణామాల మధ్య తొలి వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఫకర్ జమాన్ అవుట్ అయ్యాడు. మూడవ ఓవర్ రెండవ బంతికి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో జమాన్ ఫోర్ కొట్టాడు. ఆ తదుపరి బంతిని తక్కువ ఎత్తులో హార్దిక్ పాండ్యా వేయగా.. దానిని అంచనా వేయడంలో పకార్ జమాన్ విఫలమయ్యాడు. బ్యాట్ ఎడ్జ్ కు తగిలి బంతి కీపర్ సంజు శాంసన్ చేతిలో పడింది. దీంతో ఫకార్ జమాన్ నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. వాస్తవానికి ఆ క్యాచ్ అత్యంత సంక్లిష్టమైనది. అయినప్పటికీ సంజు ఏ మాత్రం భయపడకుండా.. తన చేతులను అత్యంత ఒడుపుగా మైదానానికి అంటి పెట్టి బంతిని అందుకున్నాడు. ఒకానొక దశలో పాకిస్థాన్ ఆటగాడు ఫకార్ జమాన్ అది ఔట్ కాదని భావించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో తీవ్ర నిరాశకు గురైన అతడు.. డ్రెస్సింగ్ రూమ్ లోనూ అదే తీరును ప్రదర్శించాడు.
టీవీ రిప్లై లో బంతి మైదానాన్ని తాకుతున్నట్టు కనిపించింది. కానీ అత్యంత సూక్ష్మంగా పరిశీలిస్తే బంతి మైదానాన్ని తాకలేదని థర్డ్ అంపైర్ ప్రకటించారు. దీంతో పాకిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రెండవ వికెట్ కు ఫర్హాన్, ఆయూబ్ 48 బంతుల్లో 72 పరుగులు జోడించారు. ఈ జోడిని శివం దుబే విడదీశాడు. భారత బౌలింగ్ లోపాలను.. ఫీల్డింగ్ లోపాలను పాకిస్తాన్ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. వాస్తవానికి ఇటీవల ఈ స్థాయిలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించడం పాకిస్తాన్ జట్టుకు ఇదే తొలిసారి. పాకిస్తాన్ ప్లేయర్లు ఆడుతున్న తీరు చూసి ఆ జట్టు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటి ఆడుతోంది మా వాళ్లేనా అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తున్నారు
Hardik Pandya has 15 wickets in just 8 Innings against Pakistan in T20I. pic.twitter.com/RyiMpauu36
— Johns. (@CricCrazyJohns) September 21, 2025