Telugu Directors: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఇప్పటివరకు ఎవ్వరూ చేయనటువంటి మంచి సినిమాలను చేస్తూ గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు తీసుకెళుతున్నారు. ఇక మన దర్శకు సైతం హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా కథలను సిద్ధం చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట మన దర్శకులు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇక ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ పాన్ ఇండియాలో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తున్నప్పటికి ఏదో ఒక విషయంలో మాత్రం మన దర్శకులు చాలా వరకు వెనుకబడిపోతున్నారనే చెప్పాలి. అదేంటి అంటే గ్రాండియార్ గా సినిమాను చేస్తూ విజువల్ వండర్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ కంటెంట్ల విషయంలో మాత్రం ఇంకా మెరుగుపడాల్సిన అవసరమైతే ఉందని చాలా విమర్శలైతే చేస్తున్నారు. మరి ఈ విషయంలో మన దర్శకులు రచయితలు తీవ్రమైన కడరత్తులు చేసి మంచి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. మారుతున్న ట్రెండుకు అనుగుణంగా కథలను రాయాలి అలా రాసిన కథలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉన్నప్పుడు జనంలోకి వెళ్తాయి.
అలాగే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ గా మారతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువ రోజులు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఏ సినిమా కూడాఆరు నెలలకు మించి ప్రేక్షకులకు గుర్తు ఉండడం లేదు.
మరి ఇలాంటి క్రమంలో కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. దర్శకులే కథలను రాసుకొని సినిమాలు చేస్తున్నారు. కాబట్టి కంటెంట్ల విషయంలో అంత పెద్దగా కేర్ తీసుకోవడం లేదు. ఒకప్పుడు రచయితలు సెపరేట్ గా ఉండి సినిమా దర్శకులకు కావలసిన విధంగా కథలను రాసి ఇచ్చేవారు. రచయితలు సెపరేట్ గా ఉండటం వల్ల మంచి కథలు వచ్చేవి.
కానీ ఇప్పుడు దర్శకులే కథను రాసుకోవడం వల్ల వాళ్ళు పెద్దగా కథల మీద దృష్టి పెట్టలేక మేకింగ్ మీదనే ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది…ఈ ఒక్క విషయాన్ని కనక ఓవర్ కమ్ చేసినట్లయితే తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవెల్ కి దూసుకెళ్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…