Shaolin Temple China : గొప్ప గొప్ప చదువులు చదివినవారంతా పీఠాధిపతులు అయిపోతే ఇదిగో ఇలానే ఏడుస్తుంది. లగ్జరీకి అలవాటు పడిన వారు అన్నీ మూసుకొని సన్యాసిగా ఉండాలంటే వారిలోని నిగ్రహం కట్టలు తెంచుకొని మంది మీద పడిపోతుంది. చైనాలో ఓ సన్నాసికి ఇదే ఎదురైంది. అందుకే పగలు పవిత్రమైన ఆలయ పీఠాధిపతిగా ఉంటూ రాత్రిళ్లు రసిక శిఖామణిగా రూపుదాల్చాడు. సన్నాసిగా పీఠాధిపతిగా ఆడవారికి సుఖాలకు దూరంగా ఉండాల్సిన పీఠాధిపతి తన కామకోరికలు దాచుకోలేక ఏకంగా వందల మంది అమ్మాయిలను తన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి వాడేశాడు. అలా ఓ బిడ్డకు తండ్రిగా కూడా మారాడు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన షావోలిన్ టెంపుల్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుంది. చైనా హెనాన్ ప్రావిన్స్లో ఉన్న ఈ పురాతన బౌద్ధ ఆలయానికి చెందిన అధిపతి షి యోంగ్జిన్‌పై ఆర్థిక, లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఆలయ పరిపాలన, మానసిక ఆధ్యాత్మికతకు మారుపేరు అయిన ఈ పీఠాన్ని కాలక్రమంలో కల్మషం మసలినదిగా మార్చిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి.
అధిపతి యోంగ్జిన్‌పై ఆలయ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకున్నాడన్న ఆరోపణలతో పాటు, అనేక మహిళలతో అక్రమ లైంగిక సంబంధాలు పెట్టుకున్నాడన్న తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు, ఆయనే ఒక మహిళతో అక్రమంగా సంబంధం పెట్టుకుని బిడ్డను కనిపించాడని కూడా ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆయన స్వచ్ఛమైన బౌద్ధ విలువలకు భిన్నంగా ప్రవర్తించడం ఆలయ సన్యాసుల మధ్య ఆందోళన కలిగించింది.
శాంతి, నైతికత, నిర్లొభత అనే బౌద్ధ విలువలను ప్రచారం చేయాల్సిన ఒక పీఠాధిపతి, ఇలాంటి లైంగిక వివాదాల్లో ఇరుక్కోవడం బౌద్ధ సమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. ఆయన చర్యలతో షావోలిన్ ఆలయ ప్రతిష్ట మసకబారుతోంది.