Rajeev Chandrasekhar కేరళ ఎన్నికలు 10 రోజుల్లో జరుగబోతోంది. ఏప్రిల్ 9న కేరళ, అస్సాం ఎన్నికలు జరుగబోతున్నాయి. అన్ని సర్వే సంస్థలు ఈసారి ఎన్నికలు టైట్ గా ఉంటాయని చెబుతున్నాయి. స్థానిక సంస్థల్లో యూడీఎఫ్ కు వాకోవర్ వచ్చినా అది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఫలించదని సర్వేలు చెబుతున్నాయి.
ఇందులో ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే.. ముక్కోణపు పోటీ కేరళలో జరుగబోతోంది. ఎన్డీఏ, కాంగ్రెస్, సీపీఎం కూటములు వేర్వేరుగా పోటీచేయబోతున్నాయి.
రాజీవ్ చంద్రశేఖర్ కేరళ బీజేపీ చీఫ్ గా వచ్చాక మొత్తం బీజేపీ బలాన్ని మార్చేశారు. కేరళ ఎకో సిస్టంలో బీజేపీని మతవాద పార్టీగా.. ముస్లింలకు వ్యతిరేక పార్టీగా ముద్ర వేసిన ఆ రాష్ట్రంలో బీజేపీని బలీయమైన శక్తిగా తీర్చిదిద్దింది రాజీవ్ చంద్రశేఖర్ నే.
కేరళలో బీజేపీని అందరి పార్టీగా మార్చిన ఘనత రాజీవ్ చంద్రశేఖర్ ది.. దీనిపై రామ్ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
