Akash Deep: జీవితం ఎప్పుడు ఎటు వైపు టర్న్ తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు టీమిండియా యువ బౌలర్ ఆకాష్ దీప్ టర్న్ వచ్చింది. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇంగ్లీష్ జట్టుతో జరుగుతున్న 2వ టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా కు సాయం కావడం వల్ల ఆకాష్ కు జట్టులో చోటు లభించింది. తొలి టెస్ట్ లో అతడు రిజర్వ్ బెంచ్ కే పరిమితం కాకావాల్సి వచ్చింది. తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ బ్యాటర్ గా, బౌలర్ గా విఫలమయ్యాడు. ఇక రెండో టెస్టులో అతడిని దూరం పెట్టారు. బుమ్రా కు విశ్రాంతి ఇవ్వడంతో.. ఆకాష్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధమైంది. దానికి తగ్గట్టుగానే అతడు తనను తాను నిరూపించుకున్నాడు.
ఆకాష్ తొలి ఇన్నింగ్స్ లో అతడు 4 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా మూడు వందల పరుగుల భాగస్వామ్యన్ని నెలకొల్పి కొరకరాని కొయ్యగా మారిపోయిన బ్రూక్ ను ఆకాష్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒక్కసారిగా భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత తదుపరి మిగతా వికెట్లను భారత బౌలర్లు కేవలం 20 పరుగుల వ్యవధిలోనే పడగొట్టారు.
ఇక రెండవ ఇన్నింగ్స్ లో ఆకాష్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే అతడు నాలుగు వికెట్లు పడగొట్టాడు. నాలుగో రోజు ఇంగ్లాండు బ్యాటింగ్ సమయంలో అత్యంత ప్రమాదకరమైన డకెట్, పోప్, రూట్ వంటి ప్లేయర్లను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం. అత్యంత ప్రమాదకరమైన బ్రూక్ ను వికెట్ల మందు దొరకబుచ్చుకోవడం గమనార్హం. ఆకాష్ దూకుడు వల్ల ఇంగ్లాండ్ జట్టు నాలుగు కీలక వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం రెండో టెస్టులో భారత్ ఎదుట ఎదురీదుతోంది.
వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో ఆకాష్ విజయవంతమయ్యాడు. అయితే ఆకాష్ రాత్రికి రాత్రే ఇక్కడ దాకా రాలేదు. మొదట్లో అతడు రంజీ క్రికెట్ బీహార్ జట్టుకు ఆడేవాడు. బీహార్ జట్టు నుంచి తొలగించడంతో అతడు తన కుటుంబాన్ని బీహార్ నుంచి ఇతర ప్రాంతానికి తరలించాడు. ఆ తర్వాత అనారోగ్యంతో తండ్రిని, సోదరుడిని మూడు నెలల వ్యవధిలో కోల్పోయాడు. ఆ సమయంలో అతని బాధ వర్ణనాతీతంగా ఉంది. ఇక ఇదే సమయంలో ఐపీఎల్లో లక్నో జట్టు తరఫున అతడు ఆడాడు. చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేశాడు.
ఐపీఎల్ లో అతడి ప్రదర్శన బాగుండడంతో మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ సిరీస్ కు ఆకాశం కల్పించింది. జట్టులో స్థానం లభించినప్పటికీ.. తుది జట్టులో అతడు చోటు దక్కించుకోలేకపోయాడు. తొలి టెస్టులో అతనికంటే శార్దుల్ ఠాగూర్ మీదనే మేనేజ్మెంట్ ఎక్కువగా చేసింది. ఐపీఎల్ లో ఎక్కువ వికెట్లను ప్రసిధ్ పడగొట్టడంతో అతడికి త్వరగానే అవకాశం లభించింది. దీంతో ఆకాశ్ రిజర్వ్ బెంచ్ కు పరిమితం కావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో బుమ్రా కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇవ్వడంతో ఆకాష్ రెండవ టెస్టులో చోటు దక్కించుకున్నాడు. అత్యంత పోటీ మధ్య అవకాశం వచ్చిన నేపథ్యంలో.. దానిని అతడు సద్వినియోగం చేసుకున్నాడు. అంతేకాదు తొలి ఇన్నింగ్స్ లో సీనియర్ బౌలర్ సిరాజ్ తర్వాత హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలిచాడు.. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో సిరాజ్ ను మించిపోయాడు..
Had to leave Bihar due to BCA ban.
Took 3 year break at 23 after father’s paralytic attack.
Lost father & elder brother within 2 months.
Survived a career-threatening back injury.
But Akash Deep never gave up. True Hero. pic.twitter.com/bDOxnaYFu4
— Sports Culture (@SportsCulture24) July 6, 2025