Maganti Gopinath Family Accident: ఇప్పటికే ఆ కుటుంబం పుట్టెడు శోకంలో ఉంది. ఇంటి పెద్దను కోల్పోయి తీవ్రమైన దుఃఖంలో ఉంది. జాలి లేని విధి ఆ కుటుంబం పై ఇంకా కక్ష కడుతూనే ఉంది. జీవితానికి సరిపడా విషాదాన్ని మోస్తున్న ఆ కుటుంబానికి.. మరో కన్నీటి చారితమైన సందర్భం ఎదురైంది.. ఈ విషయం తెలిసిన వారంతా అయ్యో అంటూ బాధపడుతున్నారు . భగవంతుడా నీకేం అన్యాయం చేశారు.. ఇలా ఎందుకు వారిని పగ పడుతున్నావు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చాలామందికి సుపరిచితుడు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు మీద గెలిచిన ఆయన.. ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారు. 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. 2023 ఎన్నికల్లోను గెలుపును అందుకున్నారు. తద్వారా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. గోపీనాథ్ కు సున్నితమైన నాయకుడిగా పేరు ఉంది. వివాద రహితుడిగా.. ప్రజలకు అండగా ఉండే ప్రజా ప్రతినిధిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
అనారోగ్య సమస్యల వల్ల గత ఏడాది మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీ తమ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ కుమార్ యాదవ్ రంగంలోకి దిగారు. హోరాహోరీగా సాగిన ఈ పోటీలో నవీన్ యాదవ్ విజయం సాధించారు..
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సునీత నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటున్నారు. ఉప ఎన్నికలు జరుగుతున్నప్పుడే సునీత కుటుంబానికి సంబంధించిన వివాదాలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా గోపీనాథ్ మొదటి కుమారుడు సంచలన విషయాలను వెల్లడించారు. తన తల్లికి గోపీనాథ్ విడాకులు ఇవ్వలేదని పేర్కొన్నారు. తన కుమారుడు చనిపోయిన విషయాన్ని కూడా చెప్పలేదని గోపీనాథ్ తల్లి ఆరోపించారు. ఇవన్నీ కూడా ఎన్నికల సమయంలో సునీతకు ప్రతిబంధకంగా మారాయి. ఈ వివాదాలు ఇలా సాగుతుండగానే.. గోపీనాథ్ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది…
సోమవారం రాత్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై గోపీనాథ్ కూతురు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టడంతో గోపీనాథ్ ఇద్దరు కుమార్తెలు గాయపడ్డారు. ఇందులో పెద్ద కూతురు అక్షర పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. అయితే అతివేగమే రోడ్డు ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. గోపీనాథ్ కుమార్తెలకు గచ్చిబౌలిలోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స అందిస్తున్నారు. అయితే అక్షర పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇంట్లో మరో విషాదం
నిన్న రాత్రి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై మాగంటి గోపినాథ్ కూతురు ప్రయాణిస్తున్న కారుకి రోడ్డు ప్రమాదం
చక్రాలు ఊడిపోయి రోడ్డుపై అడ్డంగా ఉన్న డీసీఎంను ఢీకొనడంతో, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కూతురు అక్షర… https://t.co/gGHqGhXCxI pic.twitter.com/Epcaf1G6lL
— Telugu Scribe (@TeluguScribe) March 23, 2026
