KA Paul Comments On Kavitha: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. బొగ్గుల కోసం మరొకడు ఏడ్చాడట.. ఈ సామెత తీరుగానే ఉంది ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ వ్యవహారం. అసలే పార్టీలో సరైన గుర్తింపు లభించక.. ఉన్న పదవులు మొత్తం పోయి.. చివరికి ఎమ్మెల్సీకి.. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి.. తన రాజకీయ ప్రయాణం ఏమిటో అర్థం కాక.. దిక్కుతోచని స్థితిలో ఉంది కల్వకుంట్ల కవిత. ఇలాంటి క్రమంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
Also Read: కవిత కల్లోలం.. హరీష్ రావు సమాధానాలు చెప్పాల్సిన సందర్భం ఇది..
ఆ వీడియోలో కే ఏ పాల్ కవితను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం పోరాడుతున్న కవిత తన పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. భారతీయ జనతా పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందినదని.. కాంగ్రెస్ పార్టీ కూడా మరొక సామాజిక వర్గానికి బాగా దగ్గరని.. మీరు కాషాయం పార్టీ వదిలిన బాణం కాకపోతే.. బీసీల కోసం పోరాడే తత్వం మీలో ఉంటే కచ్చితంగా ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ పిలుపునిచ్చారు. ప్రజాశాంతి పార్టీలో చేరి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని.. బీసీల సమస్యలపై పోరాడాలని సూచించారు.. దీంతో ఈ వ్యవహారం మొత్తం ఒక్కసారిగా కామెడీ అయిపోయింది. కవిత బుధవారం ఉదయం అత్యంత సీరియస్ గా విలేకరుల సమావేశం నిర్వహించి.. సంచలన వ్యాఖ్యలు చేస్తే.. కేఏ పాల్ మొత్తం దానిని హాస్యాస్పదంగా మార్చారు.
ఇప్పుడు మాత్రమే కాదు
కె ఏ పాల్ ఇప్పుడు మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఏవైనా అనూహ్యమైన రాజకీయ సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు తెరమీదకి రావడం.. కీలక నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం.. మీడియా ముందు రకరకాల వ్యాఖ్యలు చేయడం పరిపాటే. కాకపోతే కవిత తెలంగాణ పాలిటిక్స్లో బర్నింగ్ టాపిక్ అయిన నేపథ్యంలో పాల్ సడన్ గా సీన్లోకి రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిని ఎవరూ ఊహించలేకపోయినప్పటికీ.. పాల్ తన మాటల ద్వారా కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఈ వీడియోను కమలం, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ చేస్తున్నారు. గులాబీ పార్టీ నాయకులను.. గులాబీ పార్టీ అని కుల సోషల్ మీడియాకు ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
Dr K.A Paul inviting K Kavitha K. C. R.s daughter to joint BC’s party PSP pic.twitter.com/iDX9ZXFFPi
— Dr KA Paul (@KAPaulOfficial) September 3, 2025