Revanth Reddy : మీ కష్టం పగోడికి కూడా రావద్దు సీఎం సార్.. ఎంత పాపం ఇదీ.. మరీ ఇంత ఘోరమా.. దేన్నైతే ఆయుధంగా మలిచి బీఆర్ఎస్ ను గద్దెదించాడో అదే ఆయుధంతో ఇప్పుడు బీఆర్ఎస్ కొడుతుంటే పాపం రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు.. తట్టుకోలేకపోతున్నాడు. వేదికలపై ఇదే చెప్పుకొని బాధపడుతున్నాడు.
సాధారణంగా అధికారంలో ఉంటే కొండంత బలం ఉంటుంది. ఆ బలంతో ఏమైనా చేయవచ్చు. ఈ కారు రేసింగ్ లో కేటీఆర్ ను జైలుకు పంపే సదావకాశం వచ్చినా రేవంత్ ఆ ధైర్యం చేయలేదు. ఎందుకంటే దాని వల్ల నష్టమే తప్ప లాభం లేదని స్వయంగా జైలుకెళ్లి సీఎం అయిన రేవంత్ కు విషయం బాగా తెలుసు. సానుభూతితో కేటీఆర్ తన ప్రభుత్వానికి ఎసరు పెడుతాడని తెలుసు. అందుకే కేసీఆర్, కేటీఆర్ ల విషయంలో రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందడుగు వేయడం లేదు.
ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహకర్త ఐడియాలజీతో సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేసి గెలిచాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను గద్దెదింపడంలో ఇదే సోషల్ మీడియా కాంగ్రెస్ కు పాశుపతాస్త్రమైంది. ఎంతలా అంటే.. ఇన్ని సంక్షేమ పథకాలు పంచే బదులు ఓ 30 యూట్యూబ్ చానెల్స్ ను, సోషల్ మీడియాలను పెట్టుకుంటే మేం గెలిచే వాల్లం అని స్వయంగా కేటీఆర్ అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అందుకే ఓడిపోగానే కేసీఆర్ చేసిన మొదటి పని.. చిన్నా చితక జర్నలిస్టులందరినీ చేరదేరి వారితో సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేసి రేవంత్ రెడ్డి మీదకు వదిలారు. వారు తెలంగాణలో చీమ చిటుక్కుమన్నా.. రేవంత్ కు అంటగట్టి నానా యాగీ చేస్తున్నారు.
ఎంత కంట్రోల్ చేద్దామన్నా ఇది రేవంత్ చేయి దాటిపోయింది. అప్పట్లో మహబూబ్ నగర్ లో రైతులపై అఘాయిత్యం కానీ.. హైడ్రా కూల్చివేతలు.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బుల్డోజర్ తవ్వకాలు ఇలా మొత్తం రేవంత్ ఇమేజ్ ను జాతీయ స్థాయిలో డ్యామేజ్ చేయించడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు.
ఇప్పుడు ఏకంగా తెలంగాణలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉండగానే.. ఆయనకే వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి A-Z అవినీతి పేరిట హోర్డింగులు పెట్టించి కాంగ్రెస్ ప్రభుత్వం పరవు తీస్తున్నారంటే బీఆర్ఎస్ క్యాంపెయిన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చ. బీఆర్ఎస్ సోషల్ దెబ్బకు కాంగ్రెస్ విలవిలలాడుతోంది. రేవంత్ రెడ్డికి తలబొప్పి కడుతోంది. ‘ఫాఫం రేవంత్ రెడ్డి’ అని బిత్తిరి సత్తి భాషలో వాపోవడం తప్ప మనం చేసేది ఏమీ లేదు..