OG movie release : రోమ్ లో రోమన్ లా ఉండాలంటారు.. లేకపోతే అనర్ధాలు వస్తాయి. ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న ఉపద్రవాలే ఇందుకు నిదర్శనం. బతకడానికి వెళ్లినవారంతా అక్కడి సమాజంతో కలిసిపోవాలి. వారి సంస్కృతి సంప్రదాయాలు పాటించాలి. కానీ మన సంస్కృతి సంప్రదాయాలు అలవాట్లను అక్కడి వారిపై రుద్ధుతామంటే.. ఇలానే ట్రంప్ లాంటోడు వస్తాడు. అందిరినీ వారి దేశం నుంచి తన్ని తరిమేస్తాడు. ఇప్పుడూ అదే జరుగుతోంది.
H1B వీసా సమస్యల నేపథ్యంలో తెలుగు కమ్యూనిటీకి అమెరికాలో పరిస్థితి ఇప్పటికే సెన్సిటివ్‌గా ఉంది. అలాంటప్పుడు సినిమా ఫ్యాన్స్ హంగామా మరింత ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, ముఖ్యంగా అమెరికాలో ఉండే వారు, అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
Cut out launch celebrations at our vaikuntam (Cinemark Dallas XD and Imax )
#TheyCallHimOG #OGUSA#DallasPkCults pic.twitter.com/RsmdnU2OeG
— PKFC USA (@pkfc_usa) September 24, 2025
H1B కలకలం & ఇండియన్ కమ్యూనిటీ
అమెరికాలో H1B వీసాలపై వ్యతిరేకత కొత్తది కాదు కానీ, ట్రంప్ పాలనలో ఇది మరింత పెరిగింది. అధిక ఫీజులు, కఠిన నిబంధనలు, లీగల్ ఇమ్మిగ్రెంట్స్‌పై అపోహలు.. అమెరికాలో ప్రవాస భారతీయులపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఈ టెన్షన్‌లోనే స్టూడెంట్ వీసాలతో వచ్చిన వారి ప్రవర్తన, ఓవర్‌సెలబ్రేషన్స్ “అమీర్‌పేట్ మెంటాలిటీ” లాంటి ట్యాగులు అమెరికాలోని ఇతర కమ్యూనిటీల నుంచి ప్రతికూలతను మరింత పెంచుతున్నాయి.
సినిమా హంగామా ప్రభావం
అమెరికాలో ఇండియన్ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. కానీ థియేటర్స్‌లో చేయబడే హంగామా అరుపులు, నృత్యాలు, కొబ్బరికాయలు పగలగొట్టడం, ఫైర్‌వర్క్స్ ఇవన్నీ అక్కడి కుటుంబాలకు డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఇతర కమ్యూనిటీలకు ఇవి ఆశ్చర్యకరంగానేగాక, కొన్నిసార్లు డిస్టర్బెన్స్ ఆఫ్ పబ్లిక్ పీస్ కేసులుగానూ మారవచ్చు. ఒకరిరెండు తప్పులు చేస్తే కేవలం వాళ్లకే సమస్య. కానీ ఒక గ్రూప్ చేస్తే “ఇండియన్ కమ్యూనిటీ డిస్టబెన్స్” అనే లేబల్ పడుతుంది.
CINEMARK DALLAS XD AND I MAX
CELEBRATIONS @pkfc_usa @TrendPSPK pic.twitter.com/3rXbFrCpOq— OG DALLAS TX (@PSPK_OG_DALLAS) September 24, 2025
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బాధ్యత
పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు కూడా కావడంతో ఆయన అభిమానులు మరింత కంట్రోల్ చూపించాలి. వారి సెలబ్రేషన్స్ వల్ల కేవలం సినిమా ఫ్యాన్ ఇమేజ్‌కే కాదు, మొత్తం కమ్యూనిటీ ఇమేజ్‌కి కూడా నష్టం వచ్చే ప్రమాదం ఉంది.
ముఖ్యంగా OG రిలీజ్ సందర్భంలో డల్లాస్ వంటి ప్రాంతాల్లో హంగామా మొదలైతే, అది ఇతర స్టేట్స్‌లోనూ కాపీ అవుతుంది. ఇదే నిర్లక్ష్యం కొనసాగితే లీగల్ ఇష్యూస్, వీసా రద్దులు, డిపోర్టేషన్స్ వంటి అతివ్యాఖ్యలూ రాకపోవు.
#OG Cutout Launch Celebrations at USA Vaikuntam Dallas XD And IMAX
Cult mode on #TheyCallHimOGpic.twitter.com/IeypP2LCcB
— DVVEntertainment. (@DVVMovies2) September 24, 2025
అవసరమైన అవగాహన
ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యాన్స్ కేవలం సెలబ్రేషన్‌ను పర్సనల్‌గా అనుభవించే విధంగా మార్చుకోవాలి. అరుపులు, పబ్లిక్ రిచువల్స్ బదులు, శాంతంగా మూవీ చూడటం, సోషల్ మీడియాలో రివ్యూలు పంచుకోవడం మంచిది. ప్రతి ఒక్కరికి గుర్తుంచుకోవల్సింది ఏంటంటే.. ఒక చిన్న హంగామా, ఒక క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయితే, అది మొత్తం కమ్యూనిటీపై ప్రభావం చూపిస్తుంది.
అమెరికాలో ఇప్పటికే ఇండియన్ కమ్యూనిటీపై ప్రతికూలత పెరుగుతున్న సమయంలో, సినిమా హంగామాలు అదనపు సమస్యలను సృష్టిస్తున్నాయి. H1B వల్ల లీగల్ ఇమ్మిగ్రేషన్ కఠినతరం అవుతున్న వేళ, ఫ్యాన్స్ హడావుడి మొత్తం తెలుగు కమ్యూనిటీకి నష్టమే. ఈ పరిస్థితిలో అభిమానులకి ఒకే మార్గం.. స్వీయ నియంత్రణ మరియు అవగాహన ముఖ్యం.