England Vs South Africa 2nd T20I Highlights: పొట్టి ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ఈ ఫార్మాట్లో 300 స్కోర్ నమోదు కాలేదు. ఆ ఘనతను ఇంగ్లాండ్ జట్టు అధిగమించింది. సొంత దేశంలో దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు వీరవిహారం చేసింది. సాల్ట్(141), బట్లర్ (83) అదరగొట్టిన వేళ.. ఏకంగా రెండు వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా రికార్డ్ సృష్టించింది. ఈ లక్ష్యాన్ని చేదించడంలో దక్షిణాఫ్రికా జట్టు విఫలమైంది. 16.1 ఓవర్లలో 158 పరుగులకే కుప్పకూలిపోయింది. ఫలితంగా 146 పరుగుల వ్యత్యాసంతో ఆతిథ్య జట్టు విజయం సాధించింది. ఆర్చర్ 3, కరణ్, డాసన్, జాక్సన్ తలా 2 వికెట్లు సాధించారు..
సాల్ట్ ఉప్పు పాతర
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచ కోత కోసింది. ముఖ్యంగా ఓపెనర్ సాల్ట్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ తో కలిసి తొలి వికెట్ కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. సాల్ట్ 60 బంతులు మాత్రమే ఎదుర్కొని 15 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 141 పరుగులు చేశాడు. సాల్ట్, బట్లర్ దూకుడు కొనసాగించారు అనుకుంటే.. కెప్టెన్ బ్రూక్ 21 బంతుల్లో 41 పరుగులు చేశాడు. చివర్లో అతడు మెరిపించిన మెరుపుల వల్ల ఇంగ్లాండ్ జట్టు 304 పరుగులు చేసింది. తద్వారా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పటివరకు టి20 లలో హైయెస్ట్ స్కోర్ టీం ఇండియా పేరు మీద ఉండేది. బంగ్లాదేశ్ జట్టుపై 2024లో హైదరాబాద్ వేదికగా భారత్ ఆరు వికెట్ల నష్టానికి 297 పరుగులు చేసింది. ఇప్పటివరకు టి20 లలో ఇదే హైయెస్ట్ రికార్డ్ గా ఉండేది. ఆ రికార్డును ఇంగ్లాండ్ జట్టు అధిగమించింది.
పాపం దక్షిణాఫ్రికా బౌలర్లు
ఇంగ్లాండ్ బ్యాటర్ల దూకుడు వల్ల దక్షిణాఫ్రికా బౌలర్లు చేతులెత్తేశారు. మార్కో జాన్సన్ నాలుగు ఓవర్లు వేసి 60 పరుగులు సమర్పించుకున్నాడు. రబడ 4 ఓవర్లు వేసి 70 పరుగులు సమర్పించుకున్నాడు. విలియమ్స్ 3 ఓవర్లు వేసి 62 పరుగులు ఇచ్చాడు. ఫోర్టీన్ నాలుగు ఓవర్లు వేసి 52 పరుగులు ఇచ్చుకున్నాడు. మహాపాక 4 ఓవర్లు వేసి 41 పరుగులు సమర్పించుకున్నాడు. విల్ జాక్స్ మాత్రమే దక్షిణాఫ్రికా బౌలర్లలో అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు. అతడు కేవలం ఒకే ఒక ఓవర్ వేసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చుకున్నాడు.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇంగ్లాండ్ జట్టు బజ్ బాల్ గేమ్ ఆడుతుంది. అయితే టి20 లో కూడా అదే తరహాలో ఆట తీరును ప్రదర్శించింది. ప్రారంభం నుంచి చివరి వరకు దూకుడు కొనసాగించింది. తద్వారా పొట్టి ఫార్మాట్లో తమది అత్యంత భయంకరమైన జట్టు అని నిరూపించింది.. ఈ విజయం ద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ లో ఆతిధ్య, పర్యాటక జట్లు చెరో గెలుపును దక్కించుకున్నాయి. సిరీస్ విజేతను మూడో మ్యాచ్ నిర్ణయిస్తుంది.
PHIL SALT – THE FASTEST CENTURION FOR ENGLAND IN T20I HISTORY. pic.twitter.com/JzhM7RrLme
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 12, 2025