Tollywood Talent Hunt : నైజాం ప్రాంతం లో ఒక సాధారణ డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ని మొదలు పెట్టి, ఆ తర్వాత నిర్మాతగా సినిమాలు చేసి ఎవ్వరూ చూడనంత సక్సెస్ రేట్ ని చూసి, తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న నిర్మాత దిల్ రాజు(Dil Raju). ఇప్పటి వరకు ఆయన 58 సినిమాలు చేస్తే అందులో 70 శాతం కి పైగా విజయాలు సాధించినవే ఉన్నాయి. పెద్ద డైరెక్టర్స్ తో కాకుండా, కొత్త డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తూ, కొత్త డైరెక్టర్స్ ని స్టార్ డైరెక్టర్స్ గా ఇండస్ట్రీ లోకి దింపిన చరిత్ర ఆయనది. అందుకే దిల్ రాజు అంటే ఇండస్ట్రీ లో ఒక గౌరవం ఉంటుంది. ఇప్పుడు బోలెడంత టాలెంట్ పెట్టుకొని, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ఆశతో ఉండే వాళ్లకు దిల్ రాజు అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. దీని గురించి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) వివరిస్తూ విడుదల చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయ్యింది.
అందులో ఆయన మాట్లాడుతూ ‘కళ్యాణ్ రామ్ గారి పటాస్ మూవీ తో నాకు నా కెరీర్ మొదలైంది. ఆ తర్వాత దిల్ రాజు గారి ‘సుప్రీమ్’ చిత్రం నుండి నేను ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్నాను. ఈ ప్రయాణం లో దిల్ రాజు గారి నుండి నేను గమనించింది కంటెంట్ కోసం పరిగెడుతూ ఉండడం. ఆయనకు దిల్ రాజు పేరుకి బదులుగా రన్నింగ్ రాజు అనే పేరు పెట్టొచ్చు. దాదాపుగా 58 సినిమాలు ఆయన ఇప్పటి వరకు పూర్తి చేసాడు. అన్ని జానర్స్ లో ఆయన సూపర్ హిట్స్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయన కొత్తగా దిల్ రాజు డ్రీమ్స్ అనే వెబ్ సైట్ ని ప్రారంభించాడు. ఎవరైనా సరే మీ దగ్గర టాలెంట్ ఉంటే, సరికొత్త ఆలోచనలతో స్క్రిప్ట్ ని తయారు చేసి ఉంటే ఈ వెబ్ సైట్ లో లాగిన్ అయ్యి వాటిని అప్లోడ్ చేయండి. ఇది అవకాశం కోసం ఎదురు చూసే వాళ్లకు అద్భుతమైన అవకాశం’ అంటూ చెప్పుకొచ్చాడు.
అనిల్ రావిపూడి కూడా మన లాంటి సాధారణమైన బ్యాక్ గ్రౌండ్ నుండి ఇండస్ట్రీ లోకి వచ్చిన వ్యక్తి నే. అతనిలోని టాలెంట్ ని గుర్తించిన తర్వాత దిల్ రాజు ఇప్పటి వరకు అతన్ని వదల్లేదు. సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దిల్ రాజు సోదరుడు శిరీష్ అయితే అనిల్ రావిపూడి ని తెలుగు సినిమా ఇండస్ట్రీ కి దొరికిన వజ్రం అంటూ సంబోదించాడు. అతని వల్లే నేడు మా సంస్థ నిలబడింది అని గర్వంగా చెప్పుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇండస్ట్రీ లో ఒక బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తుల నుండి ఇలాంటి మాటలు మీరు కూడా పొందాలంటే వెంటనే www.dilrajudreams.com వెబ్ సైట్ లో లాగిన్ అవ్వండి. మీ అదృష్టాన్ని, ప్రతిభని పరీక్షించుకోండి.