Anushka Shetty Ghaati Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి దక్కనటువంటి గొప్ప క్రేజ్ ను సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. అయినప్పటికి అనుష్కకి ఉన్న గుర్తింపు మరే హీరోయిన్ కి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అరుంధతి, బాహుబలి లాంటి సినిమాలతో తనకంటూ ఒక స్టార్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న ఆమె ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తుంది…బాహుబలి సినిమా తర్వాత ఆమె మొత్తం పాన్ ఇండియా సినిమాను శాసిస్తుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె మాత్రం రెగ్యూలర్ గా సినిమాలు చేయకుండా అప్పుడప్పుడు సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతోంది. మరి ఇలాంటి క్రమంలోనే క్రిష్ డైరెక్షన్ లో ఘాటి అనే సినిమా చేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5 వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాతో ఆమె ఎలాంటి గుర్తింపును సంపాదించబోతుంది అనేది కీలకంగా మారుతోంది. ఇక ఈ సినిమా మీద పెద్దగా బజ్ అయితే లేదు.దాంతో సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేస్తున్న క్రమంలో అందులో అనుష్క మాత్రం కనిపించడం లేదు…ఆమె ఘాటి సినిమా ప్రమోషన్స్ లో అయితే పాల్గొనకపోవడానికి కారణం ఏంటి అంటూ ఆమె అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఓవర్ గా వెయిట్ పెరిగిందట. దానివల్ల బయట పెద్దగా కనిపించడం లేదు. కేవలం సినిమా షూటింగుల్లో మాత్రమే కనిపిస్తోంది. ఇక ఆమె స్క్రీన్ మీద కూడా ఆమె ఒరిజినల్ గా కనిపించడం లేదట.
కొత్త టెక్నాలజీ తో సీజీలో ఆమెను సన్నగా కనబడేలా తీర్చిదిద్ది మరి స్క్రీన్ మీద మనకు చూపిస్తున్నారు. నిజానికి ఆమె ఇప్పుడు 100 కిలోలకు పైన బరువుతో ఉందని అందువల్లే బయటికి పెద్దగా రావడం లేదని తెలుస్తోంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కడ కనిపించడం లేదంటూ పలు రకాల వార్తలైతే వస్తున్నాయి.
ఇక రీసెంట్ గా ఒక సినిమా దర్శకుడు సైతం ఆమెతో సినిమా చేయాలని అనుకున్నప్పటికి ఆమె తను ఇప్పుడున్న పొజిషన్లో సినిమా చేయలేనని ఓవర్ వెయిట్ కారణంగా ప్రాజెక్టులను కన్ఫామ్ చేయలేకపోతున్ననని చెప్పిందట. ఇక లైపోసెషన్ సర్జరీ చేయించుకున్న తర్వాత తను కొత్త సినిమాలకు కమిట్ అవుతానని చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా అనుష్క ఎందుకని అంత ఓవర్ వెయిట్ పెరిగింది.
తన తోటి హీరోయిన్లందరూ చాలా స్లిమ్ గా ఉండి ఇప్పటికీ మంచి సినిమాలను చేస్తుంటే ఆమెకున్న క్రేజ్ కి వాళ్ళందరినీ బీట్ చేసి ముందుకు దూసుకెళ్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె మాత్రం సినిమాలు చేయడం తగ్గించింది. ఆమె అలా ఓవర్ వెయిట్ పెరగడానికి కారణం సైజ్ జీరో అనే సినిమానే అంటూ తన అభిమానులు సైతం సైజ్ జీరో మూవీ డైరెక్టర్ అయిన ప్రకాష్ మీద ఫైర్ అవుతున్నారు…