RRR: టాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఆడియన్స్ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషించారు. అలియా భట్, ఓలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవగణ్, సముద్రఖని ప్రధాన పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లు, గలింప్స్, పాటలు అభిమానులను ఎంతగానో ఆక్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన ట్రైలర్ అయితే యూట్యూబ్‌నే షేక్ ఆడిస్తోంది.
Also Read: RRR: రామ్ మేకోవర్ అదుర్స్.. సీతారామరాజు పాత్రకోసం ఇంతలా కష్టపడ్డాడా?
ప్రమోషన్స్‌లో వేగం పెంచిన జక్కన్న.. ఇటీవలే బాలీవుడ్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్లో ఈ కార్యక్రమాన్ని అంతకు మించి అన్నట్లుగా నిర్వహించేందుకు ప్లాన్స్ చేస్తున్నారు. అయితే, బాలీవుడ్లో ఈవెంట్ ముఖ్య అతిథిగా సల్మాన్ ఖాన్ రాగా.. టాలీవుడ్‌లోనూ అంతే రేంజ్లో ఉన్న టాప్ హీరోలను పిలవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా పిలివనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇందులో రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సీతారామరాజు పాత్రలో రామ్ నటిస్తుండగా.. కొమరమ్ భీమ్ పాత్రలో తారక్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుంగా సినిమా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది.
Also Read: RRR vs Radheshyam: రాజమౌళికి పవన్ కళ్యాణ్ ఔట్.. తగ్గేదే లే అంటున్న ప్రభాస్.. కాంప్రమైజ్ అయ్యారా?
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More