పెళ్లి కాకుండానే పిల్లలను కనేసిన సినీ సెలబ్రెటీలు ! సినిమా తారలు అన్నా, సినిమాలు అన్నా.. ప్రజలు వాళ్ళను విపరీతంగా ఆరాధిస్తుంటారు. కొంతమంది అభిమానులు తమ అభిమాన స్టార్లను ఫాలో అవుతూ ఉంటారు కూడా. అయితే, కొన్ని విషయాల్లో మాత్రం స్టార్లను ఆదర్శంగా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోతున్న స్టార్లు అంతా పెళ్లి కాకుండానే పిల్లలను కనేశారు. ఈ విషయంలో అభిమానులు ఆదర్శంగా తీసుకుంటే కొంపలు కొల్లేరు అవుతాయి కాబట్టి.. ఇలాంటి అంశాల్లో ఏ స్టార్ ను ఫాలో అవ్వకూడదు. ఇంతకీ పెళ్లి కాకుండానే పిల్లలను కనేసిన ఆ సెలబ్రిటీలెవరో చూద్దాం .
1#) రేణు దేశాయ్ – పవన్ కళ్యాణ్ :
ముందుగా పవన్ పేరును చెబుతున్నందుకు పవన్ ఫ్యాన్స్ సీరియస్ అవొచ్చు. కానీ ఈ లిస్ట్ లో పవన్ పేరు ప్రముఖమైనది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ సహజీవనం చేశారు. వీరిద్దరికీ 2004 లో అకీరా పుట్టాడు. అకీరా పుట్టిన ఐదేళ్లకు అంటే 2009 లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు.
#2) శ్రీదేవి – బోనీ కపూర్
అతిలోక సుందరి శ్రీదేవి కోసం ప్రాణాలు ఇస్తాం అంటూ ఆ రోజుల్లో కురాళ్ళ, పెళ్లి కాని ప్రముఖులు వెంట పడుతూ ఉంటే.. శ్రీదేవి మాత్రం సైలెంట్ పెళ్లి అయి, పైగా షేప్ అవుట్ అయిపోయిన బోణీ కపూర్ తో ప్రేమాయణం సాగించింది. అలా శ్రీదేవి పెళ్లి కాకుండానే నిర్మాత బోనీ కపూర్ తో సహజీవనం చేసింది. దాంతో ఆమె గర్భం దాల్చింది. జాన్వీ కపూర్ 7నెలల గర్భంలో ఉన్నప్పుడు శ్రీదేవి బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ఏది ఏమైనా ఎప్పటికీ అందమైన రంగుల ప్రపంచంలో ధ్రువతారగా నిలిచిపోయింది ఈ అతిలోక సుందరి.
#3) నేహా ధూపియా- అంగద్ బేడీ
బాలీవుడ్ భారీ బ్యూటీ నేహా ధూపియా తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడీతో చాలా కాలం పాటు సహజీవనం చేసింది. దాని ఫలితంగా పెళ్లి కాకుండానే తల్లైంది. విషయం బయటకు తెలిసి నెగిటివ్ వార్తలు వచ్చాయి. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
#4) కమల్ హాసన్-సారిక
విశ్వనటుడిగా కీర్తి గడించిన కమల్ హాసన్ ప్రేమలో ఎంతో అనుభవం ఉన్న నటుడు. అలా హీరోయిన్ సారికతో ప్రేమలో మునిగితేలుతూ ఉండగా ఓ రోజు సడెన్ గా సారిక గర్భవతి అని తేలింది. అలా పెళ్లి కాకుండానే తల్లి అయింది సారిక. సారిక కమల్ తో తన పెళ్లి అవ్వక ముందే శ్రుతి హాసన్ జన్మించింది. ఆ తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. అక్షర హాసన్ జన్మించాక చక్కగా విడిపోయారు.
#5) అమృత అరోరా
హాట్ బాంబ్ మలైకా అరోరా సోదరిగా అమృత అరోరాకు మంచి గుర్తింపు ఉంది. ఈమె షకీలా లదక్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తూ కడుపు తెచ్చుకుంది. దాంతో హడావుడిగా అతన్ని పెళ్లి చేసుకుంది.
#6) హార్దిక్ పాండ్య
మనోడు మైదానంలోనే కాదు, బెడ్ రూమ్ లో కూడా విరుచుకుపడతాడు. ఎలాగూ టీమిండియా ఆల్ రౌండర్ గా పేరు ప్రఖ్యాతలు వచ్చాయి కాబట్టి.. నిజ జీవితంలోనూ క్రేజ్ దక్కింది. దాంతో కొన్ని యాడ్స్ వచ్చాయి. ఆ యాడ్స్ చేస్తోన్న క్రమంలోనే తగిలింది సెర్బియాకు చెందిన యువ నటి నటాషా స్టాన్కోవిచ్. ఆమెతో ప్రేమాయణం సాగించి పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు.
#7) కల్కి కొక్లెయిన్
బాలీవుడ్ నటి కల్కి కొక్లెయిన్ జీవితంలో కూడా ఇలాంటి బాగోతాలే ఎక్కువుగా కనిపిస్తాయి. మొదట ఆమె అనురాగ్ కశ్యప్ ను ప్రేమించి విఫలం అయింది. ఆ తర్వాత హర్ష బెర్గ్ అనే వ్యక్తిని ఘాడంగా ప్రేమించి పెళ్లి చేసుకోకుండానే తల్లి అయింది. మొత్తానికి ఈ లిస్ట్ లో తనకంటూ ఒక స్థానాన్ని దక్కించుకుంది.
#8) హీరోయిన్ అమీ జాక్సన్ – జార్జ్
‘ఐ’ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడానికి ప్రయత్నాలు చేసినా ఆ సినిమా ప్లాప్ కారణంగా అమీ జాక్సన్ కి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో తన బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో మునిగితేలుతూ మొత్తానికి పెళ్లి కాకుండానే తల్లైంది. అయితే తల్లి అయ్యాక తనకు అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు అంటుంది.
#10) మహిమా చౌదరి-బాబీ ముఖర్జీ
బాలీవుడ్ లో హాట్ బాంబ్ గా మహమా చౌదరికి మంచి పేరు ఉంది. మరి అలాంటి పేరు ఉన్నపుడు అలాంటి పనులు చేయకపోతే ఎలా ? అందుకే, మహమా చౌదరి బాబీ ముఖర్జీ అనే అతనితో డేటింగ్ చేసి గర్భవతి అయ్యాక పెళ్లి చేసుకుంది.
మొత్తానికి అందాల తారల నిజ జీవితపు రహస్యాలను తెలుసుకోవాలని అభిమానులు బాగా ఉత్సాహ పడుతూ ఉంటారు. కానీ వారి జీవితాల్లో ఎంత కంపు ఉందో చూశారా !
Web Title: These star couples have child before marriage
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com