Homeటెలివిజన్‌Hamida Khatoon: బ్రహ్మముడి సీరియల్ నటి హమీదాకు షాకింగ్ రెమ్యునరేషన్... ఒక్క రోజుకు అంత వసూలు...

Hamida Khatoon: బ్రహ్మముడి సీరియల్ నటి హమీదాకు షాకింగ్ రెమ్యునరేషన్… ఒక్క రోజుకు అంత వసూలు చేస్తుందా?

Hamida Khatoon: స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ‘ బ్రహ్మముడి ‘ సీరియల్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కావ్య అక్కగా, రాహుల్ భార్యగా బిగ్ బాస్ ఫేమ్ హమీదా ఈ సీరియల్ లో కీలక పాత్ర పోషిస్తుంది. బిగ్ బాస్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న హమీద నటిస్తున్న మొదటి సీరియల్ ఇదే కావడం విశేషం. ఒక్క సీరియల్ తోనే భారీ క్రేజ్ దక్కించుకుంటుంది. స్వప్న పాత్రలో అద్భుతంగా నటిస్తుంది.

తనను ఎలాగైనా వదిలించుకోవాలి అని చూస్తున్న భర్త, అత్తకు చుక్కలు చూపిస్తూ రఫ్ అండ్ టఫ్ అమ్మాయిగా ఈ సీరియల్ లో మెప్పిస్తుంది. కాగా స్వప్న పాత్రలో మెప్పిస్తున్న హమీద భారీ పారితోషికం అందుకుంటుందని సమాచారం. హమీద రోజుకు పది వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఒక నెలకు సుమారు హమీద 20 నుంచి 25 రోజులు బ్రహ్మముడి సీరియల్ కోసం పని చేస్తుందట.

ఆ లెక్కన హమీద నెలకు రూ. 250000 సంపాదిస్తుందని సమాచారం. అంతేకాదు పలు టీవీ షోలు, స్పెషల్ ఈవెంట్స్ ద్వారా రెండు చేతులా సంపాదిస్తుంది. హమీద మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. తెలుగులో ‘ సాహసం చేయరా డింభకా ‘ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినప్పటికీ గుర్తింపు లభించలేదు. బిగ్ బాస్ షో తో హమీద కెరీర్ టర్న్ అయింది.

హీరోయిన్ గా ప్రయత్నాలు చేసినా అవకాశాలు రాలేదు. బిగ్ బాస్ ఆమెకు బ్రేక్ ఇచ్చింది. తెలుగు రాకపోయినా హామీదకి బిగ్ బాస్ లో రెండు సార్లు అవకాశం వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 5 లో హమీద కంటెస్టెంట్ గా వెళ్ళింది. సింగర్ శ్రీరామచంద్ర తో లవ్ ట్రాక్ బాగా హైలెట్ అయింది. కానీ హౌస్ లో ఎక్కువ కాలం రాణించలేకపోయింది. ఐదో వారం ఎలిమినేట్ అయింది. అనంతరం బిగ్ బాస్ ఓటిటీ లో పాల్గొన్న హమీద 9 వారాలు హౌస్ లో ఉంది. ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తుంది.

RELATED ARTICLES

Most Popular