HomeతెలంగాణCM Revanth Reddy: రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి కలిపేస్తారా ఏంటి?

CM Revanth Reddy: రేవంత్‌రెడ్డిని బీజేపీలోకి కలిపేస్తారా ఏంటి?

CM Revanth Reddy: రేవంత్‌ రెడ్డి(Revanth Reddy) ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. 2023 డిసెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆయన రాజకీయ చరిత్రలో గతంలో ABVP (బీజేపీతో సంబంధం ఉన్న విద్యార్థి సంఘం)లో ఉన్నారని, తర్వాత ఖీఈ్కలో చేరి, 2017లో కాంగ్రెస్‌లోకి వచ్చారని తెలిసిన విషయమే. అయితే BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ.రామారావు (KTR) గతంలో పలు సందర్భాల్లో రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ(BJP)లో చేరతారని ఆరోపించారు. రేవంత్‌ ప్రధాని నరేంద్ర మోదీని ‘బడే భాయ్‌‘ అని పిలవడం, కాంగ్రెస్‌ జాతీయ నాయకత్వం మోదీని విమర్శిస్తుంటే రేవంత్‌ మాత్రం సానుకూలంగా మాట్లాడటం వంటి అంశాలను KTR హైలైట్‌ చేశారు.

Also Read: పోస్టుమార్టం: బీజేపీ అంజిరెడ్డి ఎందుకు గెలిచాడు.. కాంగ్రెస్‌ నరేందర్‌ రెడ్డి ఎందుకు ఓడాడు?

 

బీజేపీ నాయకుల ఆహ్వానం..
తాజాగా నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌(Dhrmapuri Arvind) ‘రేవంత్‌ రెడ్డి బీజేపీలోకి రావాలనుకుంటే స్వాగతిస్తాం‘ అని వ్యాఖ్యానించారు. ఆయన మాటల్లో, కాంగ్రెస్‌లో రేవంత్‌కు భవిష్యత్తు లేదని, ఆయన సామర్థ్యం బీజేపీలోనే సద్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. అయితే రేవంత్‌ను చేర్చుకోవాలా వద్దా అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని తెలిపారు. ఇక రేవంత్‌ను పదవి నుంచి తప్పిస్తారని జరుగుతున్న ప్రచారంపై మాట్లాడుతూ.. పదవి నుంచి తప్పిస్తే సీఎం చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. ఇక కేంద్రం నుంచి నిధులను కిషన్‌రెడ్డి(Kishan Reddy) అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను ఎంపీ అరవింద్‌ కండించారు.

రాజకీయ ఊహాగానాలు..
రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఎదుర్కొంటే లేదా జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ బలహీనపడితే బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇది కేవలం ఊహాగానమే. రేవంత్‌ రెడ్డి గతంలో (2020లో GHMC ఎన్నికల సమయంలో) బీజేపీలోకి వెళతారనే వార్తలను ‘ఫేక్‌ న్యూస్‌‘గా కొట్టిపారేశారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటూ ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ప్రస్తుతం కూడా ఆయన నుంచి బీజేపీలో చేరే ఉద్దేశంపై ఎటువంటి సూచనలు లేవు. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ తెలంగాణలో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ 8 సీట్లు గెలిచింది, బీజేపీ కూడా 8 సీట్లు సాధించింది, ఆఖ మాత్రం సున్నా సీట్లతో మిగిలింది. ఈ ఫలితాల తర్వాత రేవంత్‌ బీజేపీలోకి వెళతారనే చర్చ తగ్గింది. అయితే, రాజకీయ వ్యూహాలు, అంతర్గత సమీకరణలు ఎప్పుడైనా మారవచ్చు కాబట్టి ఈ అంశంపై భవిష్యత్తు ఏమిటో ఖచ్చితంగా చెప్పలేం. ప్రస్తుతానికి ‘రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా పనిచేస్తున్నారు. భవిష్యత్తులో ఏమవుతుందో చూడాలి!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version