Kalvakuntla Kavitha: గులాబీ మీడియా పట్టించుకోవడం లేదు. గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా దూరం పెడుతోంది. సమయంలో రాజకీయంగా ఒంటరిగా అడుగులు వేస్తున్న కవితకు నిన్నటిదాకా తిట్టిపోసిన ఆంధ్ర మీడియానే దిక్కవుతున్నది.. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల కాలంలో ఆంధ్ర నేపథ్యం ఉన్న వ్యక్తులు ఏర్పాటుచేసిన చానల్స్ కు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించిన కవిత.. ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో కీలక విషయాలు మాట్లాడారు.
Also Read: ఫిరాయింపు పంకిలం వైఎస్, కేసీఆర్, రేవంత్ కేనా ఆర్కే
ప్రైవేట్ న్యూస్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో కవితా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను వెల్లడించారు. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆమె మొహమాటం లేకుండా బయట పెట్టారు..” నా తండ్రి కి నేను లేఖలు రాస్తే.. కొంతమంది భారత రాష్ట్ర సమితి నాయకులు వాటిని బయటికి వచ్చేలా చేశారు. వాటిని బయటికి వచ్చేలా చేసే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆ లేఖలు బయటకి వచ్చేలా చేసినవారిని గుర్తించాలి. వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. పార్టీ వారిని గుర్తించి చర్యలు తీసుకునేదాకా.. నేను పార్టీకి దూరంగానే ఉంటాను. దీనిపై పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది.. ఎటువంటి విధానాలకు పాల్పడుతుందనే విషయాలను.. అధిష్టానానికి వదిలేస్తున్నానని” కవిత స్పష్టం చేశారు.
Also Read: కాంగ్రెసోళ్లు… అంతే బై! మల్లు రవి vs జూపల్లి వివాదం హైలైట్
కవిత చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పార్టీ నుంచి బయటికి వస్తారా? అందువల్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వాస్తవానికి పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేసినా కెసిఆర్ సహించరు. గతంలో ఆలే నరేంద్ర నుంచి మొదలు పెడితే ఈటెల రాజేందర్ వరకు ఎవరినీ కెసిఆర్ వదిలిపెట్టలేదు. పైగా తన అనుకూల మీడియాలో వారిపై వ్యతిరేక కథనాలను రాయించారు.. కొద్దిరోజులుగా భారత రాష్ట్ర సమితికి వ్యతిరేకంగా కవిత మాట్లాడుతున్నారు. సమయం దొరికిన ప్రతి సందర్భంలోనూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రిని దేవుడు అంటూనే.. ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులను దయ్యాలు అని కవిత వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను ఆమె బయటికి వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తన మానస పుత్రిక జాగృతి సంస్థ కార్యకలాపాలను ఇటీవల కాలంలో కవిత వేగిరం చేశారు. తెలంగాణ ప్రముఖుల జయంతులను జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు కవిత. ఇటీవల లీడర్ అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.. జాగృతి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల కమిటీలను ఆమె ఏర్పాటు చేశారు. తెలంగాణ మేధావులతో ఆమె వరుసగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే జాగృతి పేరుతో సోషల్ మీడియా దళాన్ని ఏర్పాటు చేసేందుకు కవిత అడుగులు వేస్తున్నారు.. మొత్తంగా చూస్తే కవిత పార్టీ నుంచి బయటికి వచ్చే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి దీనిపై కవిత ఎలాంటి సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది.