Hyderabad development: హైదరాబాద్ 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగానే తెలుసు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసింది. రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్య తగ్గించింది. ఇక రక్షణ విషయంలోనూ అనేక చర్యలు చేపట్టింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు. రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు. కానీ, రెండేళ్లలో హైదరాబాద్‌కు ఆయన పెద్దగా చేసింది ఏమీ కనిపించడం లేదు.
సగం ఆదాయం హైదరాబాద్ నుంచే..
తెలంగాణకు విశ్వనగరం హోదా వచ్చినా.. రాష్ట్రానికి సగం ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తున్నా.. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ఐటీ రంగం, ఇతర పరిశ్రమలు మరియు సేవలు నగర అభివద్ధిని ముందుకు నడిపిస్తున్నాయి. కోటి జనాభా దాటిన హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులే 10 లక్షల మంది ఉన్నారు. వీరిపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయినా నగరం గడిచిన రెండేళ్లలో పెద్దగా అభివృద్ధి చెందిన దాఖలాలు కనిపించడంలేదు. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనూ నగర ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారు.
ట్రాఫిక్ తిప్పలు..
హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతోంది. ప్రతిపాదనలు ఉన్నా, కార్యాచరణలో అందుబాటులోకి రావడం లేదు. ముఖ్యంగా నానల్ నగర్ ట్రై జంక్షన్, బేగంపేట, రసూల్పురా వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో కొత్త ఫ్లైఓవర్‌లు, రోడ్డు విస్తరణలకు ప్రతిపాదనలు చేసినా, నిర్మాణ పనులు ప్రక్రియలోనే ఉన్నాయి.
నామమాత్రపు కేటాయింపులు..
రూ.3 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్‌లో హైదరాబాద్ రోడ్డులకు కేవలం రూ.2,654 కోట్లు మాత్రమే కేటాయించారు. నీరు, డ్రెయినేజి, మెట్రోతో సహా ఇతర పనులకు మరో రూ.6 వేల కోట్లు కేటాయించారు. కానీ ఉచిత పథకాలకు రూ.లక్ష కోట్లు కేటాయించారు. హైదరాబాద్ రోడ్లకన్నా ’కళ్యాణలక్ష్మి’, ’షాదీముబారక్’ వంటి పథకాలకు ఎక్కువ నిధులు రూ.3,683 కోటుల కేటాయించారు.
కనీస సదుపాయాల కొరత
నగరంలో 24 గంటలు తాగునీరు కల్పించడం, రెయిన్ వరదలు, మెట్రో విస్తరణ వంటి ప్రాధాన్య అంశాల్లో ఆచరణలో పురోగతి లేదు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం తర్వాత ప్రజల్లో అభివృద్ధికి కొత్త ఆశలు వెలిగాయి. రాబోయే మూడేళ్లలో అయినా ప్రభుత్వం సమగ్ర దృష్టితో హైదరాబాద్‌ను అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది.
ఈ నేపథ్యంలో ఆదాయ కేంద్రమైన హైదరాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలి. నూతన మౌలిక సదుపాయాలు, మెట్రో విస్తరణ, రోడ్డు పనులు, కనీస సేవలు పై ప్రత్యేక దృష్టి పెట్టితే, నగరం బంగారు బాతుగుడ్డు నుంచి ప్రజల నిండైన అనుభవానికి మారుతుంది. కొత్తగా మరో 10 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. పరోక్షంగా మరో పది లక్షల మంది ఉపాధి పొందుతారు. కంపెనీలు హైదరాబాద్‌కు తరలి వస్తాయి. లేదంటే బెంగళూరులా మారిపోతుంది.