Village Sarpanch Elections 2025: బీహార్ రాష్ట్రంలో త్వరలో శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలవడం ఇండియా కూటమికి అత్యంత ఆవశ్యకంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఆ పార్టీ విజయం సాధిస్తామనే ధీమా లో ఉండేది. కానీ ఆ పార్టీ ఊహించిన ఫలితం రాకుండా పోయింది. దీంతో అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ బిజెపిని లక్ష్యంగా చేసుకొని విమర్శలను మొదలు పెట్టింది. ఓటు చోరీ అనే అస్త్రాన్ని ప్రయోగించింది. రాహుల్ గాంధీ అయితే ఏకంగా బీహార్ లో ప్రధానమంత్రిని లక్ష్యంగా చేసుకొని వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ ర్యాలీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముందు వరుసలో ఉంటున్నారు. రాహుల్ గాంధీ అయితే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి ఓట్ల చోరీకి పాల్పడ్డ వ్యక్తి అంటూ విమర్శిస్తున్నారు.
రేవంత్ ఊహించలేదు
బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ పిలుపుమేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ వెళ్లారు. రాహుల్ గాంధీ చేపడుతున్న ఓటు అధికారి ర్యాలీలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాము చేపట్టిన కుల గణన గురించి.. మహిళలకు ఉచితంగా కల్పిస్తున్న ఫ్రీ బస్సు గురించి.. అన్నదాతలకు చేసిన రుణాల మాఫీ గురించి రేవంత్ వివరించారు.. బీహార్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని రేవంత్ వివరించారు. రేవంత్ కు హిందీ మీద పట్టు ఎక్కువ కాబట్టి బీహార్ ప్రజలకు అర్థమయ్యే విధంగా మాట్లాడారు.. రాహుల్, ప్రియాంక తో కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.. ఇది సహజంగానే తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఉత్సాహాన్ని కలిగించింది. కొంతకాలంగా రేవంత్ ను రాహుల్ దూరం పెడుతున్నారనే విమర్శలకు సరైన సమాధానం లభించినట్లయిందని కాంగ్రెస్ శ్రేణులు భావించాయి. వారి ఆనందాన్ని దూరం చేశారు జన్ సూరజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్.
కర్రలు తీసుకొని తరిమే వాళ్ళు
ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన గతంలో ఎన్నికల వ్యూహకర్తగా ఉండేవాడు. ఆ తర్వాత రాజకీయ నాయకుడిగా మారిపోయారు. ఒక పార్టీని కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుత బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రిగా రేవంత్ బీహార్ ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ తరపున చేస్తున్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ స్పందించారు..” అసలు రేవంత్ రెడ్డి ఎవరు? ఆయనకు బీహార్ రాష్ట్రంలో ఏం పని? ఎన్నికల జరుగుతున్న సమయంలో బీహార్ ప్రజలను అవమానించేలా మాట్లాడారు.. ఇప్పుడు ఆయన బీహార్ రాష్ట్రానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారు. ఒకవేళ రేవంత్ గనుక గ్రామాల్లోకి వచ్చి ఉంటే కర్రలు తీసుకొని తరిమే వాళ్ళు. బీహార్ రాష్ట్రాన్ని అవమానించడం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటే. ఇది రాహుల్ గాంధీ మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోందని” ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్.. భారత రాష్ట్ర సమితి నాయకులను ఉద్దేశించి విమర్శలు చేస్తున్న క్రమంలో బీహార్ ప్రస్తావన వచ్చింది. కెసిఆర్ పూర్వికులు బీహార్ నుంచి వచ్చిన వారిని.. బీహార్ వారి మనస్తత్వం దోపిడీ చేసే వ్యక్తుల మాదిరిగా ఉంటుందని రేవంత్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉటంకించారు.. ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం విపరీతంగా సర్కులేట్ చేస్తోంది..