Icchampally Project: కాలేశ్వరం వల్ల తెలంగాణకు లాభం లేదని.. దానివల్ల విపరీతమైన ఖర్చు అవుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఖర్చు లేకుండానే.. తెలంగాణలో మెజారిటీ పంట పొలాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే నిజాం కాలం నాటి ప్రాజెక్టును తెరపైకి తీసుకువచ్చింది. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటి? దానివల్ల తెలంగాణకు జరిగే లాభమేంటి? వీటిపై ప్రత్యేక కథనం.
నిజాం కాలంలోనే నిర్మాణానికి కసరత్తు
నిజాం కాలంలోనే ఫ్రెంచ్ దేశాలు చెందిన ఇంజనీర్లు ఇచ్చంపల్లి ప్రాజెక్టును మొదలుపెట్టారు.. ఆ తర్వాత ఈ ఆగిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం గురించి చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. నిజాం కాలంలో ఇచ్చంపల్లి ప్రాంతం వద్ద నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టును పూర్తి చేయాలని రేవంత్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ ప్రాజెక్టు పూర్తి చేసి గోదావరి జలాలను బీడు భూములకు మళ్ళించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.
30 మంది ఇంజనీర్లు..
ఫ్రెంచ్ దేశానికి చెందిన 30 మంది ఇంజనీర్లు.. వేలాది మంది కూలీలు ఇచ్చంపల్లి ప్రాజెక్టు పనుల్లో అప్పట్లో తలమునకలయ్యారు. ఒకవేళ ఆ ప్రాజెక్టు గనుక అప్పట్లో పూర్తయి ఉంటే హైదరాబాద్ నగరానికి నిత్యం తాగునీరు అందేది. అంతేకాదు లక్షల ఎకరాలకు సాగునీరు కూడా అందేది. అయితే అనుకోకుండా ఏర్పడిన అవాంతరాల వల్ల ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. అంతు చిక్కని వ్యాధి సోకి ఇంజనీర్లు, కూలీలు చనిపోయారు. ఇక ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పనులు మొదలు కాలేదు. అయితే ఇప్పటికి నాటి కట్టడాలు కనిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా చత్తీస్ గడ్ వైపు నిర్మించిన బండ్ అత్యంత బలంగా కనిపిస్తోంది.
కేంద్రం ప్రయత్నాలు
నదులను అనుసంధానం చేయాలని ఇటీవల కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇక్కడి జీవ నదులను అనుసంధానం చేయాలని భావిస్తున్నారు.. ఇందులో భాగంగానే ఇటీవల ఇంజనీర్లు సమగ్రంగా పరిశీలన చేపట్టారు. ఇచ్చంపల్లి ప్రాజెక్టుతో పాటు ములుగు జిల్లా మంగపేట మండలం రాంపురం, కన్నాయిగూడెం మండలం కంతనపల్లి వద్ద గోదావరి పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. అయితే నాడు ఫ్రెంచ్ ఇంజనీర్లు డిజైన్ చేసిన ఎత్తిపోతల పథకం నేటికీ అనుకూలంగానే ఉందనే భావన సాగునీటి రంగ వ్యక్తమవుతోంది. అయితే నాటి కట్టడాలను పునరుద్ధరించి.. ఇప్పటి కాలానికి అనుగుణంగా ఆధునికరించి గోదావరి జలాలను బీడు భూములకు మళ్ళించాలనేది రేవంత్ ప్రభుత్వం ప్రతిపాదనగా ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రాణహిత నీళ్లు మాత్రమే ఆధారం
మరోవైపు గోదావరి నది మీద నిర్మించిన కాలేశ్వరం ఎత్తిపోతల పథకానికి మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నది నీళ్లు మాత్రమే ఆధారం. ప్రాణహిత ప్రవాహం వల్ల మేడిగడ్డ ప్రాంతంలో 2,843 TMC ల మీరు అందుబాటులో ఉంటుంది. ప్రాణహిత తరహాలోనే ఎంత చెప్పండి ప్రాంతం ఎగువన 108 మీటర్ల దూరంలో ఇంద్రావతి నది గోదావరిలో కలుస్తుంది. పూర్తిగా అడవి ప్రాంతం నుంచి వస్తున్న ఇంద్రావతి నది ప్రవాహం వృధాగా సముద్రంలో కలుస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రాణహితతో పాటు ఇంద్రావతి నది ప్రవాహాన్ని కూడా పూర్తిస్థాయిలో వాడుకుంటే తెలంగాణలో కరువు అనేది ఉండదని అధికారులు చెబుతున్నారు. ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి.. ఆ నీటిని నాగార్జునసాగర్ వైపు తరలిస్తే మరింత ఉపయుప్తంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
600 టీఎంసీల నీరు అందుబాటులో..
ఇచ్చంపల్లి వద్ద 600 టిఎంసిల నీరు అందుబాటులో ఉంటుందని సాగునీటి రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కృష్ణా నది పరివాహకంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం లేదు.. గోదావరి పరివాహక ప్రాంతంలో మాత్రం వర్షాలు మెండుగా ఉంటున్నాయి. అందువల్లే ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మించి.. తద్వారా ఆ నీటిని కృష్ణా నదికి మళ్లిస్తే నీటి కొరతను తగ్గించవచ్చనేది సాగునీటి రంగ నిపుణుల అభిప్రాయం.. ఇంద్రావతి నదికి 116 మీటర్ల దూరంలో ఉన్న భూపాలపల్లి జిల్లా పలిమెల ఆరంపల్లి వద్ద అప్పట్లో ఫ్రెంచ్ ఇంజనీర్లు గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించారు.