Asia Cup 2025 Winner: ఆసియా కప్ నిర్వహణకు కౌంట్ డౌన్ మొదలైంది. సెప్టెంబర్ 9 నుంచి ఈ మెగా టోర్నీ మొదలవుతుంది. టి20 విధానంలో ఈ టోర్నీ నిర్వహిస్తారు. గత సీజన్లో కూడా ఆసియా కప్ ను ఇదేవిధంగా నిర్వహించారు. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తాడు. గిల్ ఉపసారథిగా వ్యవహరిస్తున్నాడు. గత సీజన్లో భారత జట్టు విజేతగా నిలిచింది. అంతేకాదు ఇటీవరలి టి20 టోర్నీలలో టీమిండియా ఓటమి అనేది లేకుండా దూసుకుపోతోంది. సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో అప్రతిహత విజయాలు సాధిస్తోంది.
ఈసారి కూడా గెలుస్తుందట
సెప్టెంబర్ 9 నుంచి మొదలయ్యే ఆసియా కప్ లో విజేతగా నిలిచేది ఎవరో శ్రీలంక ఆటగాడు మహరూఫ్ చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూలో అతడు ఆసియా కప్ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ” పొట్టి ఫార్మాట్ లో ఏదైనా జరగొచ్చు. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ సంచలన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాయి. పాకిస్తాన్ కాలంలో తన స్థాయి దగ్గరగా ప్రదర్శన చేయడం లేదు. అలాంటప్పుడు టైటిల్ ఫేవరెట్ గా ఆ జట్టును భావించలేం. టీమిండియాలో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. అభిషేక్ శర్మ నుంచి మొదలుపెడితే గిల్ వరకు అందరూ సమర్థత కలిగి ఉన్న ఆటగాళ్లే. వారంతా కూడా తమ స్థాయి ఏమిటో ఇటీవలి టోర్నీలలో నిరూపించుకున్నారు. కొత్తగా వారు నిరూపించుకోవడానికి ఏమీ లేదు. అసాధ్యం అనుకున్న సమయంలో కూడా వారు అద్భుతాలు చేస్తారు. పొట్టి వరల్డ్ కప్ అదే నిరూపించింది. అమెరికా వేదికగా.. వెస్టిండీస్ వేదికగా టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. బలమైన ఆస్ట్రేలియా.. విభిన్నమైన ఇంగ్లాండు జట్టును.. మట్టి కరిపించింది. శివకి ప్రోటిస్ జట్టను కూడా ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుందని” మహరూఫ్ పేర్కొన్నాడు.
అద్భుతాలు చేస్తారు
“టీమిండియాలో ప్రతిభావంతమైన ప్లేయర్లు ఉన్నారు. వారు అద్భుతాలు చేస్తారు. ఏమాత్రం అవకాశం దొరికినా సరే ప్రత్యర్థి జట్టుకు కోలుకోలేని నష్టం చేకూర్చుతారు. వారితో ఏ జట్టుకైనా నష్టమే. గత సీజన్లో భారత ప్లేయర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఆడే అవకాశం ఉంది. పైగా యువ ఆటగాళ్లు అత్యున్నతమైన ఫామ్ లో ఉన్నారు. వారిని ఓడించాలంటే ప్రత్యర్థి జట్టు తమ స్థాయికి మించి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. అలా ఏ జట్టు చేస్తే ఆ జట్టు విజయం సాధిస్తుంది. అయితే అది అనుకున్నంత సులభం కాదు. ఎందుకంటే యూఏఈ వేదిక మీదుగానే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. పైగా ఆ మైదానాలు టీమ్ ఇండియా ప్లేయర్లకు కొట్టినపిండి. అలాంటప్పుడు ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఎలాంటి వ్యూహాలు రచిస్తారనేది ఆసక్తికరంగా ఉంటుందని” మహరూఫ్ పేర్కొన్నాడు.